కేజ్రీవాల్ మరో సంచలనం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో రికార్డు సృష్టించింది. తమ పార్టీలో చేరాలనుకునే వారు 98 71 01 01 01 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ఫలితాలు వెలువడిన రెండో రోజు 11 లక్షల మంది ఆ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చారు‌. ఇది తమ పార్టీ సాధించిన మరో విజయం అని ఆమ్ ఆద్మీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించడమే కాక 70 స్థానాలకు గాను 62 స్థానాలను దక్కించుకోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఈనేపథ్యంలోనే ఒక రోజులో 11 లక్షల మంది ఆమ్ ఆద్మీ లో చేరేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఇదిలావుండగా కేజ్రీవాల్ ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*