కేరళ వరద బాధితులకు తిరుమల వాసుల చేయూత

– తిరుమల స్థానిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 11,11,111రూపాయలు విరాళాలు సేకరణ

– టీటీడీ ఈవో కి డిడిని అందజేత

కేరళలో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ వాసులను చూసి తిరుమల స్థానికులు చలించిపోయారు దీంతో తమ వంతు సాయం అందించాలని ఉన్నత సంకల్పంతో టి.ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ విరాళాలు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చేతుల మీదుగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేయాలని స్థానికులు కోరారు.

తిరుమల లో ఉన్న స్థానిక దుకాణదారులు, లైసెన్స్ వ్యాపారస్తులు విరాళాలు పెద్ద ఎత్తున అందించారు. దేశవ్యాప్తంగా భక్తులు తిరుమలకు వస్తుండడం వారి నుండి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే స్థానికులు చేయూతను ఇవ్వడం మరచిపోలేనిధి టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లా నుండి ఇంత పెద్ద ఎత్తున విరాళం ఇవ్వడం ఇదే ప్రథమమన్నారు. టి.ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించేందుకు కృషిచేసిన సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎం మునిరెడ్డి కే ఎం సత్యనారాయణ, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.జయ కృష్ణ కార్యదర్శి ఆర్ వి గిరి, ట్రెజరర్ బి కోదండరామిరెడ్డి, సభ్యులు బి సురేష్ పాత్రికేయులు బాల సుబ్రహ్మణ్యం, శీను బాబు ఇతర సభ్యులు పాల్గొన్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*