కేర‌ళ వ‌ర‌ద బాధితుల కోసం సినీ న‌టులు ఎవ‌రెవ‌రు ఎంత సాయం చేశారో తెలుసా?

కేర‌ళ‌ను వ‌ర‌ద‌లు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. గ‌త 100 ఏళ్ల‌లో ఎన్న‌డూ లేనంత భారీ వ‌ర్షాలు కురిసి వంద‌ల మంది మ‌ర‌ణించారు. ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. బాధితుల‌ను ఆదుకోమ‌ని ఆ రాష్ర్ట ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ పిలుపునిచ్చారు. సినీ న‌టులు, క్రీడాకారులు, వ్య‌క్తులు, సంస్థ‌లు అంద‌రూ స్పందిస్తున్నారు. హాలీవుట్‌, టాలీవుడ్‌, కోలీవుడ్….అన్ని భాష‌ల న‌టులు స్పందిస్తున్నారు. ఇప్ప‌టి దాకా ఏ న‌టుడు ఎంత విరాళం ప్ర‌క‌టించారో తెలుసా…

-స్టార్‌ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టి రూ.25 లక్షలు చొప్పున సాయం చేశారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMMA) రెండు విడతల్లో రూ.50 లక్షలు ఇచ్చింది.

-యువ నటుడు తొవినో థామస్‌ మరో అడుగు ముందుకు వేశారు. ఇరింజలక్కుడలోని తన ఇంటిలో బాధితులకు ఆశ్రయం కల్పించారు. అంతేకాదు వరదలు తగ్గే వరకు బాధితులకు అత్యవసర సరకులు సరఫరా చేస్తానని చెప్పారు.

– హీరో అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘‘కేరళ ప్రజలు నాపై చూపిన అమితమైన ప్రేమ, అభిమానం.. నా హృదయంలో వారికి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచింది. వారి కోసం నా వంతుగా సాయం చేయాలి అనుకుంటున్నా’’ అని రూ.25 లక్షలు ఇస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

– హీరో విజయ్‌ దేవరకొండ కూడా తన వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. అంతేకాదు కేరళ వాసులకు సాయపడేందుకు ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు.

– ‘గీత గోవిందం’ సినిమా వసూళ్లను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందిస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు తెలిపారు.

– తమిళ స్టార్‌ హీరోలు కమల్‌ హాసన్‌, సూర్య-కార్తి, విజయ్‌ సేతుపతి రూ.25 లక్షలు చొప్పున విరాళం ఇచ్చారు.‌ సూర్య ప్రత్యేకంగా ‘AMMA’ ఫండ్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

– హీరో సిద్ధార్థ్‌ సోషల్‌మీడియా ఛాలెంజ్‌ ప్రారంభించారు. కేరళ కోసం విరాళాలు అందించాలని కోరారు. తన వంతుగా రూ.10 లక్షలు విరాళం అందిస్తున్నట్లు చెప్పారు.‌ 2015లో తమిళనాడులో వరదలు సంభవించినప్పుడూ సిద్ధార్థ్‌ చాలా ముఖ్య పాత్ర పోషించారు.

– హీరో ధనుష్‌ రూ.15 లక్షలు, విశాల్‌, శివకార్తికేయన్‌ రూ.10 లక్షలు చొప్పున కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు. సన్‌ టీవీ నెట్‌వర్క్‌ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*