కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చేశారు… ఆయన రెడ్డి కాదు…! జగన్ వ్యతిరేక మీడియాకు ఆశాభంగం..!!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద వేటు పడిన కొన్ని గంటల్లోనే ఆ స్థానానికి కొత్త కమిషనర్ వచ్చేశారు. నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్నట్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కమిషనర్ గా నియమించి లేదు. మద్రాసు హైకోర్టు హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనకరాజ్ కొత్త కమిషనరుగా శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.

పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా హైకోర్టు న్యాయమూర్తి హోదాకు తగ్గని వ్యక్తి గా ఉండాలని, అలాగే పదవీకాలం మూడేళ్లకు పరిమితం చేస్తూ ఆర్డినన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కోల్పోవాల్సి వచ్చింది.

బాధ్యతలు చేపడుతున్న కనగరాజ్

ఈ పరిణామాలు జరిగిన వెంటనే జగన్ వ్యతిరేక మీడియా ఒక ప్రచారం ప్రారంభించింది. ఎన్నికల కమిషనరుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తారని హోరెత్తించారు. తుడా విసిగా ఉన్న సుందర్ రెడ్డిని కొత్త కమిషనరుగా నియమించినట్లు వార్తలు ప్రసారం చేశారు. ఈ అంచనాలు, ఆరోపణలకు భిన్నంగా ప్రభుత్వం….రెడ్డి సామాజికవర్గానికి చెందని కనకరాజ్ కమిషనరుగా నియమించింది. కనకరాజు పేరును ప్రభుత్వం గవర్నర్ కు పంపడం, ఆయన ఆమోదిచడం, ప్రభుత్వం జివో జారీ చేయడం, ఆయన బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి.

ఈ నిర్ణయం జగన్ వ్యతిరేక మీడియాకు ఆశాభంగమనే చెప్పాలి. రెడ్డి సామాజిక తరగతికి చెందిన వ్యక్తిని నియమించి వుంటే…ఆ పేరుతో ఇంకో వారం రోజులు నానారభస చేయడానికి ఉపయోగపడి ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*