కొత్త రూ.2000 నోటు చిరిగిపోయిందా….!

కొత్త రూ.2000, రూ.500 నోట్లు కొద్దిగా న‌లిగినా చెల్ల‌బోవ‌ని, చిన్న‌పాటి రాత‌లున్నా తీసుకోర‌ని ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే…నోట్లు చిరిగినా….చిరిగిన ప‌రిమాణం బ‌ట్టి బ్యాంకులు డ‌బ్బులు చెల్లిస్తాయి.

ఇకపై రూ.2,000, రూ.200 నోట్లు చిరిగిన స్థాయిని బట్టి వాటి విలువ పూర్తిగా లేదా సగంగా లెక్కగట్టనున్నారు. రిజర్వు బ్యాంకు నూతన నిబంధనల ప్రకారం రూ.200, రూ.2,000 నోట్లతో పాటు మహాత్మ గాంధీ కొత్త సీరిస్‌ కలిగిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. పాత సిరీస్‌ నోట్లతో పోలిస్తే వీటి సైజు చిన్నగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చిరిగిపోయిన కొత్త సిరీస్‌ నోటు మార్పిడిలో పూర్తి విలువ చెల్లింపునకు సంబంధించిన నిబంధనలను మార్చినట్లు ఆర్‌బిఐ తెలిపింది. ఈ మేరకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (నోట్‌ రిఫండ్‌) నిబంధనలు-2009లో సవరణలు చేసినట్టు పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు డిజిగేటెడ్‌ బ్యాంకు శాఖలు, ఆర్‌బిఐ కార్యాలయాల్లో ముక్కలైన, పాడయిపోయిన నోట్లను మార్చుకోవచ్చు.

2016 నవంబర్‌ 8నాటి నోట్ల రద్దుకు ముందు రూ.5 నుంచి రూ.1,000 మధ్య కలిగిన నోట్ల వరకు మాత్రం నోట్‌ రిఫండ్‌ నిబంధనలున్నాయి. తాజాగా రూ.200, రూ.2000 నోట్లను కూడా ఈ పరిధిలోకి తీసుకురావడానికి కొత్త నిబంధనలు రూపొందించింది. ఆర్ధిక శాఖ ఆమోదం తర్వాత ఆర్‌బిఐ దీనిపై ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్‌బిఐ కొత్త నిబంధనల ప్రకారం రూ.2000 నోటుకు పూర్తి రిఫండ్‌ చేయాలంటే కనీసం 88 చదరపు సెంటీమీటర్లు బాగుండాలి. ఈ నోటు మొత్తంగా 109.56 చదరపు సెంటీమీటర్లు కలిగి ఉం టుంది. ఒక వేళ 44 సెంటీమీటర్ల కంటే ఎక్కువ చిరిగిపోతే సగం విలువ చెల్లిస్తారు. రూ.200 నోటు 78 చదరపు సెంటీమీటర్లు బాగుంటే పూర్తిగా చెల్లిస్తారు. 39 చదరపు సెంటీమీటర్ల కంటే ఎక్కువ చిరిగిపోతే సగం విలువ చెల్లిస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*