కోలా ఆనంద్ జన్మదినోత్సం….రక్తదానం..!

బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కంచి గురవయ్య, తేజో భారత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో SVIMS, తిరుపతి వారి సహకారంతో పట్టణములోని సరస్వతి ఆడిటోరియం నందు మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహించటం జరిగింది.

ఈ సందర్భంగా కోలా ఆనంద కుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా నేను చేపట్టే ప్రతి కార్యక్రమానికి కూడా నా అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా నిలబడి విజయవంతం చేస్తూ వచ్చారు. అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు ప్రారంభించినప్పటి నుండి నేటి వరకూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరాలను నిర్వహించటం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం,ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటం మనసుకు చాలా సంతోషాన్నిస్తుందని అన్నారు. ఇందుకు కారణమైన మా బిజెపి-జనసేన కార్యకర్తలందరికి,ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

రక్తదాన శిబిరం నిర్వహణ కర్త కంచి గురవయ్య మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా కోలా ఆనంద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మహత్కార్యాన్ని సహచర నాయకులు, కార్యకర్తల సహకారంతో నిర్వహిస్తున్నానని అన్నారు. ఈ సంవత్సరం కార్యక్రమంలో తేజో భారత్ ఆర్గనైజేషన్ నుంచి కూడా సహకారం అందడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా 100 సంఖ్య తగ్గకుండా రక్త దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తం ఇస్తున్నారని, ఈ సంవత్సరం కూడా దాదాపు 150 మంది బిజెపి-జనసేన కార్యకర్తలు,ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయటం సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంభీకాసమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి కృపా కటాక్షాలతో నాచేత ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహింపచేస్తూ, అందుకు తగిన సహకారాన్ని, ప్రోత్సాహాన్ని నిరంతరం అందజేస్తున్నటువంటి మా అన్నయ్య కోలా ఆనంద కుమార్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రాబోయే కాలంలో నా సహచర కార్యకర్తలు,నాయకుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*