కోవిడ్ కేర్ కిట్లు…హోమ్ ఐసులేషన్ కిట్లు సిద్ధం..!

తిరుపతి : కరోనా బాధితుల్లో కొండంత భరోసాను నింపే అంశంలో కోవిడ్ సమన్వయ కమిటీ ముందడుగు వేసింది. కరోనా బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే కోవిడ్ కేర్, హోమ్ ఐశులేషన్ కిట్లు సిద్ధమయ్యాయి. ఈ కిట్ల ను బుధవారం ప్రభుత్వ విప్, సమన్వయ కమిటీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేసీ వీరబ్రహ్మం, తుడా వీసీ హరికృష్ణ, ఇంఛార్జి అధికారులు వ్వెంకటేశ్వర్లు, దస్తగేరయ్య తో కలిసి ఆవిష్కరించారు. త్వరితగతిన బాధితులకు చెరవేయాలని చెవిరెడ్డి అధికారులకు సూచించారు.

కోవిడ్ కేర్ కిట్ : కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు క్వారంటై న్ కేంద్రాల్లో వైద్య సేవలు పొందుతున్న బాధితులకు కోవిడ్ సమన్వయ కమిటీ కోవిడ్ కేర్ కిట్ లను అందించనుంది. బాధితుల అవసరాలకు అనుగుణంగా అందులో 31 రకాల వస్తువులు, మందులను ఉంచారు. అవి.. ఊరగాయ, సోప్ బాక్స్, టూత్ బ్రష్, పేస్ట్, పౌడర్, కొబ్బరినూనె, టంగ్ క్లీనర్, దువ్వెన, డె టా ల్ సబ్బు, బట్టల సబ్బు, ఒక నోట్ పుస్తకం, ఒక పెన్ను, ఒక బెడ్ షీట్, రెండు న్యాపికిన్స్, 100 గ్రాముల పసుపు, 250 గ్రాముల రాళ్ళ ఉప్పు, 15 సర్జికల్ మాస్కులు, 5 జతల చేతి గ్లౌజులు, సానిటైజ ర్ బాటిల్, నాసల్ డ్రాప్స్, జింకోవిట్ 10 మాత్రలు, పారా సిట్ మాల్ 10 మాత్రలు, డి- విటమిన్ 2 మాత్రలు, లిమ్ సి 30 మాత్రలు, హైడ్రాక్సిక్లోరోక్విన్ 12 మాత్రలు, ఒక పాకెట్, స్పూను, ఫోర్క్, గ్లసు, జూసు కప్ ను అందించనున్నారు.

హోమ్ ఐసోలేషన్ కిట్ : కరోనా పాజిటివ్ వచ్చి ఇంటి వద్దనే ఉంటూ వైద్యసేవలు పొందుతున్న వారి కోసం హోమ్ ఐసులేషన్ కిట్టు ను సిద్దం చేశారు. అందులో 17 రకాల వస్తువులు, మందులు ఉంచారు. అవి.. 15 సర్జికల్ మాస్కులు, 100 గ్రాముల పసుపు, డెటాల్ సబ్బు, శానిటైజర్, రాళ్ళ ఉప్పు, 5 జతల చేతి గ్లౌజులు, కషాయం, నాసల్ డ్రాప్స్, జింకొవిట్ 10 మాత్రలు, డి- విటమిన్ 2 మాత్రలు, పారాసిట్ మాల్ 10 మాత్రలు, లి మ్ సి విటమిన్ 30 మాత్రలు, హైడ్రాక్సిక్లీరోక్విన్ 12 మాత్రలు, స్పూను, ఫోర్క్, గ్లాసు, జూసు కప్ ను అందించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*