క్షురకులతో గొడవకు దిగిన చంద్రబాబు

తమ వేతనాలు పెంచాలని, తమను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ఆలయ క్షురకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విధుల్లో గొడవ పడినట్లు గొడవకు దిగారు. తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న బలహీన వర్గాలకు చెందిన వారిని కూడా చూడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు. వేలు చూపుతూ మీ వల్ల ఇది చేసుకోండి అంటూ హెచ్చరించారు. ఒక దశలో మాట్లాడుతున్న వారిని కొట్టేస్తారు ఏమో అనేంతగా ఆవేశపడ్డారు. జీతాలు పెంచేది లేదు , కానీ ఇచ్చేది లేదు ఏం చేస్తారో చేసుకోండి… మిమ్మల్ని లోనికి రాణించింది తప్పు… అంటూ ఊగిపోయారు. ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు… అని ఆగ్రహం చేశారు. వాళ్లని వదలండయ్యా ఏం చేస్తారో చూద్దాం… అంటూ సెక్యూరిటీ ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉంటుంది బీసీలు. బీసీల దయాదాక్షిణ్యాలతో అధికారం వెలగబెడుతున్న చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని మరిచి పోయారు… అంటూ బీసీ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి తీరును తప్పుబడుతున్నారు. చంద్రబాబు అసహనాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

https://m.facebook.com/story.php?story_fbid=456034101513940&id=327120054405346

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*