గాంధీ జ‌యంతి రోజు – ప్ర‌జాస్వామ్యంపై ఉక్కుపాదం!

గాంధీ జ‌యంతి రోజున ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయింది. బెంగాల్ లో ఓ పత్రిక‌ను నిషేధిస్తే…ఢిల్లీలో రైతుల‌పై జ‌ల ఫిరంగులు ప్ర‌యోగించారు. నిర‌స‌న తెలిపే హ‌క్కుపై ఉక్కుపాదం మోపారు. ఆంగ్లేయుల పాల‌న‌లో కాబ‌ట్టి స‌రిపోయింది….ఇప్పుడ‌యితే గాంధీ కూడా నిర‌స‌న తెలియ‌జేయ‌గ‌లిగేవారు కాదు. స్వాతంత్ర్యం సాధించ‌గ‌లిగేవారు కాదు…అనిపించేలా ఉన్నాయి పాల‌కుల చ‌ర్య‌లు.

బెంగాల్ ప్ర‌తికపై నిషేధం!
గత నాలుగు దశాబ్దాలుగా వామపక్ష భావాలతో బెంగాలీ భాషలో అగర్తల నుంచి నడుస్తున్నదేశర్‌ కధ దినపత్రిక రిజిస్ట్రేషన్‌ రద్దు చేయటంతో అక్టోబరు రెండవ తేదీ నుంచి ముద్రణ నిలిచిపోయింది. పత్రికలో ముద్రించిన సంపాదకుడు, ముద్రాపకుడి పేర్లకు ఆర్‌ఎన్‌ఐ వద్ద వున్న వివరాలకు సరిపోలటం లేదని వచ్చిన ఫిర్యాదుతో పాటు పత్రికలు, పుస్తకాల రిజిస్ట్రేషన్‌ చట్ట 1867ను వుల్లంఘించినట్లు తమ పరిశీలనలో తేలిందని జిల్లా కలెక్టర్‌ కొద్ది కాలం క్రితం మీడియాకు చెప్పారు. అనుమతి లేకుండా యాజమాన్య మార్పులు జరిగాయని, ఇతర కారణాలు చూపుతూ కలెక్టర్‌ పంపిన నివేదిక ఆధారంగా వార్తాపత్రికల రిజిస్ట్రార్‌ పత్రిక రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. నిజంగా అలాంటి లోపాలు వుంటే ఆ సాంకేతిక అంశాలను సరి చేసుకొనేందుకు గడువు ఇస్తూ హెచ్చరించవచ్చు. లేదా ఇతర చర్యలు తీసుకున్నా ఎవరూ అభ్యంతరపెట్టనవసరం లేదు కానీ ఏకంగా పత్రికనే మూసివేస్తూ సర్టిఫికెట్‌ రద్దు

కొద్ది వారాల క్రితం రైతుల ఆదాయాల పెరుగుదల గురించి కేంద్ర ప్రభుత్వ ప్రచార బండారాన్ని ఎండగడుతూ ఎబిపి న్యూస్‌ ఛానల్‌ వార్తను ప్రసారం చేసింది. దానిపౖౖె కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని కంపెనీలపై వత్తిడి తెచ్చి వాణిజ్య ప్రకటనలను నిలివి వేయించారు. దాంతో యాజమాన్యం ఒక సంపాదకుడిని, యాంకర్‌ చేత బలవంతంగా రాజీనామా చేయించింది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడి ఆదాయం గురించి వార్తలు ప్రచురించిన వైర్‌ వెబ్‌ పోర్టల్‌పై కూడా కేసు దాఖలు చేసి వేధిస్తున్న విషయం విదితమే. త్రిపుర రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ తీరు తెన్నులు, ఆ పార్టీ దాడులను వెల్లడించటంలో ముందున్న దేశర్‌ కధను దెబ్బతీసేందుకు సాంకేతిక అంశాలను సాకుగా తీసుకున్నట్లు కనిపిస్తున్నదని ఎన్‌ఏజె పేర్కొన్నది. ఇటువంటి చర్యలను యావత్‌ జర్నలిస్టు లోకం, ప్రజాతంత్రవాదులు పలు రూపాల్లో నిరసన తెలియచేయాలని, ఇందుకు రాష్ట్ర శాఖలు చొరవ తీసుకోవాలని ఎన్‌ఏజె కోరింది.

రైతులపై జల ఫిరంగులు
దేశ రాజధాని దిల్లీలోకి ప్రవేశించకుండా దాదాపు 30వేల మంది రైతులను పోలీసుల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. పది రోజులుగా మహా పాదయాత్ర చేపట్టి దిల్లీకి చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళ‌న‌కు దిగారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు భాష్పవాయువు‌, జలఫిరంగులను‌ ఉపయోగిగించారు. దీంతో భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన వేలాది మంది రైతులు దిల్లీ- ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులో రోడ్లపై ఉండిపోయారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత నరేశ్‌ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ఇక్కడ(దిల్లీ-యూపీ సరిహద్దు) ఎందుకు ఆపారు? మేము క్రమశిక్షణతో శాంతయుతంగా నిరసన ర్యాలీ చేస్తున్నాం. మా సమస్యల గురించి ప్రభుత్వానికి కాకుండా ఎవరికి చెప్పాలి? పాకిస్థాన్‌కో లేదా బంగ్లాదేశ్‌కో వెళ్లిపోవాలా?’ అని ఆవేశంగా అన్నారు. కాగా ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదని దిల్లీ పోలీసులు చెప్తున్నారు. అయితే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రైతులను నగరంలోకి ప్రవేశించనివ్వండి… వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. వారిని అడ్డుకోవడం తప్పని పేర్కొన్నారు.

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని, రుణాలు మాఫీ చేయాలని, ఎన్సీఆర్‌లో పదేళ్లు పైబడిన ట్రాక్టర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఇంకా పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి సెప్టెంబరు 23న కిసాన్‌ క్రాంతి ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల మీదుగా అక్టోబరు 2న దిల్లీలోని కిసాన్‌ ఘాట్‌కు చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ వారిని పోలీసులు దిల్లీలోకి అనుమతించడం లేదు.

1 Comment

  1. మన దేశం ప్రజాస్వామ్యం ముసుగులో నియంత్ర్యత్వం వైపు వేగంగా వెళుతూ ఉంది.. అయితే దీనికి ప్రజాలుకూడా కొంత బాధ్యత వహించాలి… మన రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను విపరీతమైన దుర్వినియోగం చేస్తున్నారు.. ఇది సహజంగానే పాలకులకు కంటగింపుగా ఉంటుంది.. ప్రజలు బాధ్యతలను మరిస్తే పాలకుల దురాగతాలు పెచ్చరిల్లుతాయి… మనదేశంలో ఇప్పుడిదే జరుగుతూ ఉంది.. నియంతృత్వపు రుచిచూస్తే కానీ జనాలకి అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటో తెలిసివస్తుంది.. వాక్స్వాతంత్ర్యాన్ని పూర్తిగా సమర్థించే నాకు ఓవైపు ఈ పరిణామాలు ఆందోళనను కలిగిస్తున్నా, మరోవైపు బాధ్యతమరిచి స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న జనాలకు, సంస్థలకు బుద్ధిరావాలని కోరుకొంటున్నాను..

Leave a Reply

Your email address will not be published.


*