గాడిద మాంసం తినొచ్చా…తినకూడదా?

రాష్ట్ర హైకోర్టుకే ఈ సందేహం కలిగింది. అందుకే గాడిద మాంసం తినవచ్చో…తినకూడదో తెలియజేయాలంటూ కేంద్రాన్ని ఆదేశిచింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాల్లోకి వెళితే….తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో ఒకచోట గాడిదలను వధించి, మాంసం విక్రయిస్తున్నారట. జంతువుల కోసం పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ దీనిపై రాష్ట్ర హైకోర్టులో కేసు దాఖలు చేసింది. గాడిదల వధను అడ్డుకోవాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టుకు అసలు గాడిదలను వధింవచ్చా…ఆ మాంసం తినవచ్చా అనే సందేహాలు కలిగాయి. దీన్ని నిర్ధారించుకునేందుకు వధించకూడని జంతువుల జాబితా ఇవ్వాలని కోరింది. హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఒక్కోప్రాంతంలో ఒక్కో రకమైన ఆహార అలవాట్లు ఉంటాయి. మాంసాహారంలోనూ ఈ తేడాలున్నాయి…అని చెప్పింది. మన దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో కుక్కుల మాంసం తినే అలవాటు ఉంది. వీధి కుక్కలనూ తినేస్తారట. పశుమాంసాన్ని కోట్ల మంది తింటారు. అయితే…ఆ మధ్య గోవధ నిషేధం పేరుతో కేంద్రం ఆంక్షలు విధించడంతో తీవ్రమైన వ్యతిరేక వ్యక్తమయింది. గోమాంసం తింటున్నారనే పేరుతో పలువురిపై ‘గోసంరక్షకులు’ దాడులు చేసి ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. భారత దేశంలో ఎంత భిన్నత్వం ఉంటుందో చెప్పడానికి ఆహార అలవాట్లూ ఒక ఉదాహరణ.

గాడిద గురించి…
గుర్రం జాతికే చెందిన గాడిదను దాదాపు 5000 ఏళ్ల నుంచి సరుకుల రవాణాకు ఉపయోగిస్తున్నారు. రెండు రకాల గాడిదలు ఉండేవి. ఒకటి ఇంటిలో పెంచుకునేవి. రెండు అడవి గాడిదలు. అడవి గాడిదలు క్రమంగా క్షీణించిపోయాయి. పెంపుడు జంతువుగా ఉన్న గాడిద ఇప్పటికీ ఉంది. మనుషులు రవాణా సాధనంగానూ వినియోగించేవారు. ఒకపఉపడు గ్రామాల్లో ఉప్పు విక్రయించేవాళ్లు బస్తాలను గాడిదలపైనే వేసుకొచ్చేవారు. రజకులు బట్టల మూటలను గాడిదలపైన వేసి తీసుకెళ్లేవారు. తిరుపతి శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు పైపులైను వేసినపుడు ఎల్‌ అండ్‌ టి సంస్థ గాడిదల ద్వారానే ఇసుక, సిమెంట్‌ వంటివి తరలించింది. గాడిద పాలు తాగితే జబ్బులు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకం జనంలో ఉంది. లీటరు గాడిద పాలు రూ.80,000 అని చెబుతారు. కొన్ని దేశాల్లో గాడిత పాలతో జున్ను తయారుచేసి విక్రయిస్తారట. గాడిదలు 50 ఏళ్లదాకా జీవిస్తాయి. ఒక్కోదాని బరువు 100 కేజీల నుంచి 400 కేజీల దాకా ఉంటుందట.

గుర్రంలా గాడిద పరుగెత్తకపోవుటకు కారణము
వివిధ జంతువులకు వివిధ రకాలైన శారీరక నిర్మాణం ఉంది. గుర్రానికి, గాడిదకు కొన్ని పోలికలు ఉన్నా శరీర నిర్మాణం ఒకేలా ఉండదు. గాడిదకు, గుర్రానికి ఉన్న జన్యు సారూప్యత కన్నా, జీబ్రాకు, గుర్రానికి మధ్య ఎక్కువ జన్యు సారూప్యత ఉంది. గుర్రం దేహంలో వేగంగా పరిగెత్తడానికి వీలైన బాహ్య, అంతర వ్యవస్థలు ఉన్నాయి. దాని కాలి కండరాల దృఢత్వం ఎక్కువ. ఆ కాళ్లను, మడమలను నియంత్రించే మెదడు భాగానికి, దాని కండరాలకు మధ్య ఉన్న నాడీసంధానం గాడిదకు లేదు. గుర్రం కాళ్లు పొడవుగా ఉండడం, మెడ భాగం దృఢంగా ఉండడం వల్ల పరిగెత్తేప్పుడు అది తన శరీరాన్ని బాగా నియంత్రించుకోగలదు. పరిగెత్తడంలో గుర్రం తోక పాత్ర కూడా ఎక్కువ.ఇలాంటి శారీరక అనుకూలతలే జంతువుల పరుగు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి.

1 Comment

  1. అవ్నిటినిమించి గాడిద మాంసం తింటే ఎంతటి దెబ్బలనైనా తట్టుకోవచ్చునని, ఎంతటి దెబ్బలు తగిలినా నొప్పి కలగదని దొంగతనాలు, దోపిడీలు చేసేవారు
    తింటారని సీనియర్ పోలీసులు అనుభవ పూర్వకంగా ఉదాహరణలతో చెబుతుంటారు.

Leave a Reply

Your email address will not be published.


*