గుమ్మడి కాయలు బద్దలుకొట్టిన సునీల్‌, అల్లరి నరేష్‌!

సిల్లీ ఫెలోస్‌తో సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న అల్లరి నరేష్‌, సునీల్‌ బిగ్‌బాస్‌ ఇంటిలోకెళ్లి వినోదం పంచారు. తమ సినిమా సిల్లీ ఫెలోస్‌ ప్రమోషన్‌ కోసం ఆదివారం రాత్రి ఆ ఇద్దరు నటులూ బిగ్‌బాస్‌ ఇంటిలోకి వెళ్లారు. ఈ సందర్భంగా నాని వారికి గుమ్మడికాయలు ఇచ్చి బద్దలు కొట్టిచారు. సునీల్‌, నరేష్‌ను అన్నదమ్ములుగా విడిపోయి, తమ మధ్య తతెత్తిన రూ.500 కోట్ల ఆస్తి తగాదాను నాని వద్ద మధ్యస్తం చేసుకోవాలి. ఇంటి సభ్యులను రెండు టీంలుగా విభజించుకుని ఎవరి వాదనలు వారు వినిపించాలి. ఇదీ ఆదివారం నాటి ఎపిషోడ్‌లో సరదా ఆట. ఆస్తి మాకు దక్కాలంటే మాకు దక్కాలంటూ ఇంటి సభ్యులు సునీల్‌, నరేష్‌ తరపున వాదనలు వినిపించారు. ఈ వాదనలు ఎటూ తేలకపోయేసరికి….సిక్స్‌ ప్యాక్‌ చేసిన సునీల్‌కి, పుల్లలావుండే నరేష్‌కి కడవడంత గుమ్మడి కాయలు ఇచ్చి…బద్దలు కొట్టమని చెప్పారు. ఎవరు ముందుగా గుమ్మడి కాయను పగలగొడితే…వారికే ఆస్తి దక్కుతుందని నాని ప్రకటించారు. సునీల్‌ ఒక వేటులో తనకిచ్చిన గుమ్మడి కాయను బద్దలు చేశారు. కొన్ని సెకన్ల తేడాలో నరేష్‌ కూడా బద్దలు కొట్టారు. బిగ్‌బాస్‌ ఇంట్లో సిల్లీ ఫెలోస్‌ ఇలా సందడి చేశారు.
ఈవారం శ్యామల్‌ బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. అమిత్‌ వెళ్లిపోతారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో విస్తృతంగా జరిగింది. ఈ అంచనాలకు భిన్నంగా శ్యామలను ఇంటి నుంచి బయటకు పంపారు. శ్యామల ఒకసారి ఎలిమినేట్‌ అయి…వైల్‌డ్డకార్డు ద్వారా రెండోసారి ఇంటిలోకి ప్రవేశించారు. అమిత్‌ మొదటి నుంచి ఇంట్లోనే ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే శ్యామలను బయటకు పంపినట్లున్నారు. ఒకసారి బయటకు వెళ్లి మళ్లీ వచ్చిన నూతన్‌ నాయుడు కూడా వెళ్లిపోయారు. అదేవిధంగా వైల్డ్‌కార్డు ద్వారా మధ్యలో వచ్చిన పూజ రామచంద్రన్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు శ్యామల వంతు వచ్చింది. మధ్యలో వచ్చినవారు, బయటకు వెళ్లివచ్చినవారు ఎవరూ ఇప్పుడు హౌజ్‌లో లేరు. షో ప్రారంభంలో బిగ్‌బాస్‌ ఇంట్లో 16 మంది ఉండగా…ఇప్పుడు ఏడుగురు మాత్రమే ఉన్నారు. వచ్చేవారు దీప్తి, అమిత్‌ ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలున్నాయి. గుమ్మడి కాయలు బద్దలుకొట్టిన సునీల్‌, అల్లరి నరేష్‌!

సిల్లీ ఫెలోస్‌తో సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న అల్లరి నరేష్‌, సునీల్‌ బిగ్‌బాస్‌ ఇంటిలోకెళ్లి వినోదం పంచారు. తమ సినిమా సిల్లీ ఫెలోస్‌ ప్రమోషన్‌ కోసం ఆదివారం రాత్రి ఆ ఇద్దరు నటులూ బిగ్‌బాస్‌ ఇంటిలోకి వెళ్లారు. ఈ సందర్భంగా నాని వారికి గుమ్మడికాయలు ఇచ్చి బద్దలు కొట్టిచారు. సునీల్‌, నరేష్‌ను అన్నదమ్ములుగా విడిపోయి, తమ మధ్య తతెత్తిన రూ.500 కోట్ల ఆస్తి తగాదాను నాని వద్ద మధ్యస్తం చేసుకోవాలి. ఇంటి సభ్యులను రెండు టీంలుగా విభజించుకుని ఎవరి వాదనలు వారు వినిపించాలి. ఇదీ ఆదివారం నాటి ఎపిషోడ్‌లో సరదా ఆట. ఆస్తి మాకు దక్కాలంటే మాకు దక్కాలంటూ ఇంటి సభ్యులు సునీల్‌, నరేష్‌ తరపున వాదనలు వినిపించారు. ఈ వాదనలు ఎటూ తేలకపోయేసరికి….సిక్స్‌ ప్యాక్‌ చేసిన సునీల్‌కి, పుల్లలావుండే నరేష్‌కి కడవడంత గుమ్మడి కాయలు ఇచ్చి…బద్దలు కొట్టమని చెప్పారు. ఎవరు ముందుగా గుమ్మడి కాయను పగలగొడితే…వారికే ఆస్తి దక్కుతుందని నాని ప్రకటించారు. సునీల్‌ ఒక వేటులో తనకిచ్చిన గుమ్మడి కాయను బద్దలు చేశారు. కొన్ని సెకన్ల తేడాలో నరేష్‌ కూడా బద్దలు కొట్టారు. బిగ్‌బాస్‌ ఇంట్లో సిల్లీ ఫెలోస్‌ ఇలా సందడి చేశారు.

ఈవారం శ్యామల్‌ బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. అమిత్‌ వెళ్లిపోతారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో విస్తృతంగా జరిగింది. ఈ అంచనాలకు భిన్నంగా శ్యామలను ఇంటి నుంచి బయటకు పంపారు. శ్యామల ఒకసారి ఎలిమినేట్‌ అయి…వైల్‌డ్డకార్డు ద్వారా రెండోసారి ఇంటిలోకి ప్రవేశించారు. అమిత్‌ మొదటి నుంచి ఇంట్లోనే ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే శ్యామలను బయటకు పంపినట్లున్నారు. ఒకసారి బయటకు వెళ్లి మళ్లీ వచ్చిన నూతన్‌ నాయుడు కూడా వెళ్లిపోయారు. అదేవిధంగా వైల్డ్‌కార్డు ద్వారా మధ్యలో వచ్చిన పూజ రామచంద్రన్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు శ్యామల వంతు వచ్చింది. మధ్యలో వచ్చినవారు, బయటకు వెళ్లివచ్చినవారు ఎవరూ ఇప్పుడు హౌజ్‌లో లేరు. షో ప్రారంభంలో బిగ్‌బాస్‌ ఇంట్లో 16 మంది ఉండగా…ఇప్పుడు ఏడుగురు మాత్రమే ఉన్నారు. వచ్చేవారు దీప్తి, అమిత్‌ ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.

*