గెలిస్తే పట్టుదల అంటారు…ఓడిపోతే మూర్ఖత్వం అంటారు..

‘తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో… చరిత్రే నిర్ణయిస్తుంది’ ఇవీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ ఆధారంగా రూపొందిస్తున్న యాత్ర సినిమా సీజర్ ద్వారా బ‌య‌టికొచ్చిన తొలి మాట‌లు. వైఎస్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని 7వ తేదీ అర్థ‌రాత్రి దాటిన త‌రువాత 12.00.01 గంట‌ల‌కు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. మల‌యాళ మెగాస్టార్‌ మమ్ముటీ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్ జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా యాత్రను మహి రూపొందిస్తున్నారు. పంచెకట్టులో వైఎస్ఆర్‌ను తలపిస్తూ.. అదే దరహాసం.. అదే తరహా అభివాదం ఓవరాల్‌గా మమ్ముట్టి.. లుక్‌ ఆకర్షించింది. ‘కే’ అందించిన బ్యాక్‌ గ్రౌడ్‌ స్కోర్‌ గూస్‌బమ్స్‌ తెప్పించేదిలా ఉంది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. అతిత్వరలో ప్రజల ముందుకు రానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*