గ్రామీణుల తువ్వాలు విలువేంటో తెలుస్తోంది…!

కరోనా వైరస్‌కు భయపడి ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌ ధరించి తిరుగుతున్నారు. ఇది చూశాక ఒకప్పటి గ్రామీణు తువ్వాలు గుర్తుకొచ్చింది.

దాదాపు రెండు దశాబ్దాలు వెనక్కి వెళితే, గ్రామీణులు…మగవారు ఒక వయసు రాగానే పంచె కట్టుకుని, భుజాన తువ్వాలు వేసుకుని కనిపించేవారు. ఆ మాటకొస్తే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, పెద్ద వయసు వాళ్లు పంచె, తువ్వాలు ధరిస్తున్నవారు ఉన్నారు. ఈ తువ్వాలు కొన్నిచోట్ల పైపంచె అని, పైగుడ్డ, టవల్‌ అని రకరకాలుగా పిలుస్తారు.

పొలం నుంచి ఇంటికి రాగానే బయటే కాళ్లూ చేతు కడుక్కుని, తువ్వాలుతో తుడుచుకునేవారు. భోజనం చేసిన తరువాత తువ్వాలుతోనే తుడుచుకునే వాళ్లు. ఎక్కడైనా బంధువు ఇళ్లకు వెళితే…అక్కడా ముఖం కడుక్కోడానికి, చేతు తుడుచుకోడానికి సొంత తువ్వాలునే వాడేవాళ్లు.

ఎండలో నడవాల్సివస్తేతువ్వాలును తపై నీడగా వేసుకునేవాళ్లు. గాలిబలంగా వీస్తే తువ్వాలును ముఖానికి కప్పుకునేవాళ్లు. చిన్నపాటి చినుకు వచ్చినా తువ్వాలే రక్షణ ఇచ్చేది. పొలం వద్ద నుంచి కూరగాయు వంటివి తీసుకురావాన్నా తువ్వాల్లోనే మూటగట్టుకుని వచ్చేవాళ్లు. వ్యవసాయ పనులు చేసి అసిపోతే…ఏ చెట్టునీడకో చేరి, భుజాన ఉన్న తువ్వాలునే పరచి కొంతసేపు నడుం వాల్చేవాళ్లు.

ధనవంతు టర్కీ టవళ్లు, పట్టు పైపంచెలు వాడితే…పేదు నూలుతో చేసిన తువ్వాళ్లు వేడేవాళ్లు. తువ్వాలు అనేది పెద్దరికానికి సంకేతంగా కూడా ఉండేది. పెదరాయుడు సినిమాలో చూపించినట్లు పైపంచను స్టయిల్‌గా తిప్పకపోయినా… పంచాయతీ పెద్దమనుషుల భుజాన తువ్వాలు ఉండేది. పౌరుషం వస్తే తువ్వాలు త‌ల‌కు చుట్టేవాళ్లు. కోపం వ‌స్తే తువ్వాల‌ను బ‌లంగా విదిల్చేవాళ్లు.

పంచె స్థానంలో ప్యాంటు వచ్చాక…పైగుడ్డ చిన్నదిగా మారిపోయింది. కర్చిప్‌ రూపంలో జేబులో ఇమిడిపోయింది. పైపంచెతో ఉన్నంత ఉపయోగం కర్చిప్‌తో లేదు. ఆ మాటకొస్తే…పంచె కడుతున్న పెద్దవాళ్లూ భుజాన తువ్వాలు వేసుకోవడం లేదు. జేబులో కర్చిప్‌ పెట్టుకుంటున్నారు.

కరోనా భయంతో మాస్క్ ధరించక తప్పడం లేదు. అవి దొరకడం లేదు. జేబులోని కర్చిప్‌ తీసి కట్టుకుందామనుకుంటే అది అందడం లేదు. దీంతో పెద్ద కర్చిప్ కొనుక్కుంటున్నారు. ముఖానికి చుట్టుకుంటున్నారు. ఆడవాళ్లు స్కార్ప్‌ ధరించడం ఫ్యాషన్‌కే అయినా….ఇప్పుడు అది కూడా ఇప్పుడు రక్షణ కవచంగా మారింది.

ఒకానొక సందర్భంలో ఒకానొక వస్తువు విలువ, మనుషుల విలువ తెలుస్తుంది. గ్రామీణుల భుజాన ఉండే తువ్వాలు ఎంత మేలు చేసివుంటుందో కరోనా మాస్క్‌ను చూసిన తరువాతే అర్థమయింది. నాకూ ఇంటి వద్ద ఉన్నంత సేపూ భుజాన తువ్వాలు వేసుకునే అవాటు ఉన్నందుకు ఒకింత సంతోషంగా ఉంది.

-Adimulam Sekhar

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*