గ్రామ వాలంటీర్ల బాధ్యత గురుతరం..ఎస్సీవి నాయుడు

శ్రీకాళహస్తి : ప్రభుత్వ పథకాలను ప్రజలు వద్దకు చేర్చే గురుతర బాధ్యత వాలంటీర్లుదేనని, అందరూ సేవాభావంతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలని శ్రీకాళహస్తి మాజీ ఎంఎల్ఏ ఎస్సీవీ నాయుడు అన్నారు.

తొట్టంబేడు మండలం తంగెళ్ల పాలెం గ్రామం వాలంటీర్లుగా నియమింపబడిన పది మందికి నియామక పత్రాలను ఎస్ సి వి నాయుడు అందజేశారు. వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మహోన్నత ఆశయంతో, గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల పోస్టులను తీసుకువస్తున్నారని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా సామాన్య ప్రజలు ఏ ప్రభుత్వ పథకమైనా ఇంటి వద్ద నుంచి పొందాలన్నదే సీఎం ఆకాంక్ష అన్నారు. సీఎం లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా వాలంటీర్లు కృషి చేయాలని కోరారు. పథకాలను సామాన్యుల చెంతకు చేర్చే గురుతర బాధ్యత తమ భుజస్కందాలపై ఉందని గుర్తుంచుకోవాలన్నారు. వాలంటీర్లు చిన్నతనంలోనే సేవచేసే భాగ్యం లభించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు తెచ్చే బాధ్యత వాలంటీర్ల మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తంగేడుపాలెం సింగిల్ విండో అధ్యక్షులు మోహన్ కిషోర్, గ్రామ కార్యదర్శి చెంచయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*