చంద్రగిరి నియోజకవర్గంలో 16 లక్షల కోడిగుడ్లు పంపిణీకి శ్రీకారం

కరోనా కట్టడికి కోడిగుడ్డు మహా ఔషధంలా పనిచేస్తుందని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. కోడిగుడ్డు తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. చంద్రగిరి నియోజకర్గంలో ప్రజలందరికీ ప్రతి ఇంటికి 10 చొప్పున 16 లక్షల కోడిగుడ్లు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

సుందర నాయుడి నుంచి కోడిగుడ్లు స్వీకరిస్తున్న చెవిరెడ్డి

శుక్రవారం చిత్తూరు పీవికే ఎన్ డిగ్రీ కళాశాలలో కోడిగుడ్ల పంపిణీ కార్యక్రమాన్ని చెవిరెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌ ల్డ్రీ సంఘం అధ్యక్షులు సుందర నాయుడు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందర నాయుడు మాట్లాడుతూ…. తల్లిగర్భంలో ఉండే బిడ్డకు కూడా కోడిగుడ్డు తినడం ద్వారా పోషకాలు అందుతాయని వివరించారు. అంతటి సామర్ధ్యం కలిగిన కోడిగుడ్డు విలువని నేడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలకు ఉచితంగా అందజేయడం అభినందనీయమని కొనియాడారు. అలాగే కోలుకోలేని విధంగా దెబ్బతిన్న పౌ ల్డ్రీ వ్యవస్థను ఆడుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. చెవిరెడ్డి నిర్ణయం ప్రజాప్రతినిధులకు స్ఫూర్తి దాయకమని జంగాలపల్లి శ్రీనివాస్ అన్నారు. నియోజక వర్గ ప్రజల కోసం ఈ తరహాలో 16 లక్షల కోడిగుడ్లు పంచిపెట్టిన ఘనత చెవిరెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు.

చెవిరెడ్డి మాట్లాడుతూ నా నియోజకవర్గం లో 1.50 లక్షల ఇళ్ళకు 10 కోడి గుడ్లు చొప్పున ప్రతి ఇంటికి పంపిణీ చేసే దిశగా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ప్రజలకు డి- విటమిన్ అందించేందుకు నా వంతు ఖర్చు చేశానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి విజయానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*