చంద్రగ్రహనంతో భూమి అంతరించిపోతుందా! టివిలకు గోనినేని లేని కొరత!!

మతపరమైన వివాదాలు, మూఢ విశ్వాసాలపై చర్చ దొరికిందంటే టివి ఛానళ్లకు పండగే పండగ. ఎందుకంటే…ఒకవైపు ఎవరో ఒక స్వామీజీనో, వాస్తు ‘నిపుణుడు’నో మరోవైపు ఏ హేతువాదినో, జన విజ్ఞాన వేదిక కార్యకర్తనో కూర్చోబెట్టి గంటల తరబడి చర్చలు చేస్తాయి. అది చర్చ అనేదానికంటే గొడవ అంటే బాగుంటదనేలా కీచులాడు కుంటుంటే….ఆ దృశ్యాలతో టివి రేటింగులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటి చర్చ (రచ్చ) చేయడానికి వచ్చిన గొప్ప అవకాశం సంపూర్ణ చంద్రగహ్రనం.

శుక్రవారం రాత్రి సంభవించనున్న ఈ అరుదైన ఖగోల విన్యాసాన్ని చూసేందుకు, అధ్యయనం చేసేందుకు ప్రపంచ వ్యాపితంగా శాస్త్రవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. అయితే…మన టివి ఛానళ్లలో మాత్రం, ఇది అరుదైన ఖగోల పరిణామం అని చెబుతూనే….దీనివల్ల భూ విశానసం జరుగుతుందన్న వాదనను ప్రసారం చేస్తున్నాయి. చంద్రగ్రహనం తరువాత మామూలుగానే సూర్యోదయం అవుతుందిగానీ….చూసేందుకు మనం ఉంటామా? అని ప్రశ్నిస్తూ హోరెత్తిస్తోంది ఓ ఛానల్‌. దీనికి ఎవరో ఒక దిక్కుమాలిన వ్యక్తి బైట్స్‌ను చూపిస్తోంది. అయినా….అలాంటిదేమైనా ఉంటే, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ – నాసానో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్త్రోనో చెప్పేవి కదా. ఒకేసారి వందల రాకెట్లు అంతరిక్షానికి పంపగల శక్తిసామర్థ్యాలను సంతరించుకున్న ఇస్రోకు ఇటువంటివి తెలియవా? ఇస్రో వంటి సంస్థలు చెప్పని విషయాన్ని పదేపదే ఎందుకు చూపిస్తున్నట్లు? జనాన్ని ఎందుకు భయపడెతున్నట్లు? ఎందుకంటే రేటింగుల కోసమే.

గ్రహనాల సమయాల్లో టివి చర్చలు జరుగుతుంటాయి. ప్రముఖ హేతువాది బాబుగోనినేని స్వామీజీలు, వాస్తు సిద్ధాంతులు చెప్పే విషయాలను ధైర్యంగా ఖండిస్తుంటారు. మూఢ నమ్మకాలను ప్రచారం చేయొద్దంటూ ఘీంకరిస్తుంటారు. అలాంటి గోగినేని ప్రస్తుతం బిగ్‌బాస్‌ షోలో ఉండిపోయారు. దీంతో ఆయన్ను పిలిచి చర్చ పెట్టే అవకాశం లేకుండాపోయింది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు చాలామందే ఉన్నా….బాబు గోగినేని దీనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయారు. ఇటువంటి చర్చల ద్వారానే తెలుగు ప్రజలకు సుపరిచితులయ్యారు. గోనినేని బయట లేకపోవడం టివి ఛానళ్లకు తీరని లోటుగానే చెప్పాలి. గోగినేని బయటవుండివుంటే….భూ విశాసనం వంటి ప్రచారాన్ని తుత్తునియలు చేసివుండేవారు అనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*