చంద్రబాబుకు ఒకే రోజు రెండు‌ అవమానాలు..!

Nara Chandrababu Naidu

రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవమని గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ‌ అధినేత నారా చంద్రబాబు నాయుడికి…. రాజకీయంగా ఒకే రోజు (19.06.2020) అవమానాలు ఎదురయ్యాయి. మన మీడియా ఈ విషయాలను దాచి పెట్టవచ్చుగానీ…సోషల్ మీడియా మాత్రం విడిచిపెట్టదు కదా..!

చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ‌ సమావేశానికి బాబును అహ్వానించలేదు. కనీసం ఐదుగురు ఎంపిలు ఉన్న పార్టీలనే ఆహ్వానించాలని విధానపరమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. టిడిపికి లోక్ సభ, రాజ్యసభలో కలిపి నలుగురు సభ్యులే ఉన్నారు. దురదృష్టం ఏమంటే..
టిడిపి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సీతామహాలక్ష్మి పదవీకాలం రెండు‌రోజుల క్రితమే ముగిసింది.

ఈ విధంగా చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి అర్హత కోల్పోయారు. అయినా…శుక్రవారం ఉదయం కూడా… చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి వెళుతయన్నారని, ప్రధాని నుంచి ఆహ్వానం ‌అందిందని…టిడిపి ‌సోషల్ ప్రచారం చేసింది.‌ ఒకవేళ చంద్రబాబుకు అవకాశం దొరికి, అఖిలపక్ష సమావేశంలో పాల్గొని ఉంటే….ముఖ్యమంత్రి జగన్ కంటే చంద్రబాబుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పచ్చ మీడియా వార్తలు ప్రించి ఉండేది.‌‌ ఈ సమావేశానికి బాబుని పిలవలేదన్న అంశం వార్త కాదన్నట్లు ఆ మీడియా దాటవేసింది.

ఇక ఇదోరోజు జరిగిన రాజ్యసభ ‌ఎన్నికల ఫలితం మరో‌ అవమానం. ఓడిపోతారని తెలిసినా వర్ల రామయ్యను పోటీకి దించారు బాబు. అయినా తమ పార్టీకి ఉన్న 23 మంది ఎంఎల్ఏల ఓట్లనూ వేయించుకోలేక పోయారు. టిడిపికి దూరమై వైసిపికి సన్నిహితంగా ఉంటున్న ముగ్గురు ఎంఎల్ఏలు…చెల్లకుండా ఓటు వేశారు.

అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు కుమార్తె, రాజమండ్రి ఎంఎల్ఏ అయిన భవానీ కూడా చెల్లకుండా ఓటు వేశారు. బాబుపై వ్యతిరేకతతో ఆమె కావాలనే చెల్లని ఓటు వేశారని చెబుతున్నారు. మరో ఎంఎల్ఏ సత్యప్రసాద్ క్వారంటైన్ లో ఉన్నానంటూ ఓటింగ్ కు రాలేదు. అరెస్టయి కస్టడీలో ఉన్న అచ్చెన్నాయుడు ఓటింగ్ ఓటింగ్ లో పాల్గొనలేదు. ఈ ఎన్నికల్లో పోటీ వల్ల టిడిపికి‌ పరాభవం తప్ప ఒరిగింది లేదు. ఈ విధంగా చంద్రబాబుకు ఓకేరోజు రెండు అవమానాలు ఎదురయ్యాయి..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*