చంద్రబాబుకు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చేస్తుందా…!

ఇన్నాళ్లు ఎపిలో ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపులర్ మీడియాగా పిలవబడే వాటికి అప్పనంగా కోట్లాది రూపాయలు దోచి పెట్టినందున అధికారాంతమున ఈ పాపులర్ మీడియా చంద్రబాబు నాయుడు రుణం తీర్చు కొంటున్నాయి. రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ, లఖనవ్ తదితర పట్టణాల్లో చేస్తున్న పర్యటనల వార్తలను గోరంత కొండంత గా ఇస్తున్నాయి. పేజీలకు పేజీలు చంద్రబాబు నాయుడు వార్త లతో నింపి రుణం తీర్చు కుంటున్నాయి.ముందు చూపుతోనే చంద్రబాబు నాయుడు వ్యవహరించారేమో.

గమనార్హమైన అంశమేమంటే అదే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు పర్యటనలు చర్చోపచర్చలతో సంబంధం లేకుండా చాప కింద నీరులాగా జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలను రంగంలోకి దింపి బిజెపి యేతర అన్ని పార్టీలతో చర్చలు ప్రారంభించారు. ఈ వార్తలు జాతీయ మీడియాలో ప్రముఖంగా వున్నా ఎపిలో మాత్రం పాపులర్ మీడియాలో సింగిల్ కాలం వార్తలుగా మిగిలి పోయాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పర్యటనల వార్తల ముందు ఇవి అప్రాముఖ్యంగా వుండాలి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు వార్తలు అన్ని పేజీలలో తాటికాయంత అక్షరాలతో ప్రచురితమౌతున్నాయి.

ఎపిలోని పాపులర్ మీడియా ఆభివర్ణించు తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పి బిజెపియేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? లేక జాతీయ మీడియాలో వెలువడిన ప్రకారం సోనియా గాంధీ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు పోతాయా?
మరో విశేషం ఏమిటంటే ఇంత వరకు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీని కలవ లేదు. పైగా సోనియా గాంధీ చేస్తున్న ముమ్మర ప్రయత్నాలలో భాగంగానే రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు కలిసినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతే కాకుండా రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులను పలు ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరపమని ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం తన ప్రయత్నాలు తాను కొన సాగించుతూ చంద్రబాబు నాయుడు పర్యటనలు చర్చలు ఉపయోగించు కొనే వ్యూహం అమలు చేస్తోంది. ఒక వేళ చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు గెలుపొందిన వారిని కలుపుకొనే విధంగా పథక రచన చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని కేవలం చంద్రబాబు నాయుడు యాత్రలపై ఆధారపడకుండా ఆయా ప్రాంతీయ పార్టీల నేతలతో పరిచయాలు వున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులను రంగంలోనికి దింపి తమ ప్రయత్నాలలో ఇద్దరూ వున్నారు.

ఎన్నికలు ఫలితాలు ఏలా వుంటాయి ఏమో గాని కెసిఆర్ జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలతో సంప్రదింపులు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా వున్నట్లు ఈ పరిణామాల బట్టి అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ ఎపిలో వైసిపి గణనీయంగా స్థానాలు పొందితే ప్రస్తుతం వెలువడుతున్న వార్తల ప్రకారం కాంగ్రెస్ వైసిపి మద్దతు పొందేందుకు సిద్ధం కావచ్చు. అదే జరిగితే గత నెల రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న హంగామా పర్యటనలు సంప్రదింపులు అన్నీ బూదిదలో పోసిన పన్నీరే అవుతుంది.

వాస్తవం చెప్పాలంటే రేపు ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించే పార్లమెంటు స్థానాలు – శాసనసభలో సాధించే మెజారిటీని బట్టి జాతీయ స్థాయిలో ఆయన పాత్ర వుండబోతోంది.
ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్ అధిష్ఠానవర్గం చంద్రబాబు నాయుడు ఎంత చొరవ తీసుకుని ముందుకు పోతున్నా…సోనియా గాంధీ లేక కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం మాత్రం తమ ప్రయత్నాలలో తాము వున్నారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు పైననే ఆధారపడటం లేదు. వచ్చిన చిక్కు ఏమంటే అవసర మైతే తమ వెంట వున్న చంద్రబాబు నాయుడును పక్కనబెట్టి… ఆయన బద్ద వ్యతిరేకులతో కూడా జట్టు కట్టేందుకు సిద్ధమయ్యేట్లు పరిణామాలు సూచిస్తున్నాయి. ఇదే జరిగితే…ఒక వేళ ఎక్కువ పార్లమెంటు స్థానాలు టిడిపి గెలుపొందకపోతే అన్నీ భరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వుండవలసినదే.

ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు రెండు అడ్డంకులు ఎదురు కానున్నాయి. 1)చంద్రబాబు నాయుడు పర్యటనలతో నిమిత్తం లేకుండా సోనియా గాంధీ కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్నరాజకీయ రాయ బారాలు. 2) రేపు ఎపి ఎన్నికల ఫలితాలు. మొన్న ఢిల్లీలో ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒక ప్రశ్న వేశారు. ఎపిలో ఎన్నికల్లో ఓడిపోతే జాతీయ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తారా? ఈ ప్రశ్న ఎపిలో ఎవరూ అడగ లేక పోవచ్చు. మొత్తం మీద ఇది కీలక మైనది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*