చంద్రబాబును మరోసారి చావుదెబ్బ కొట్టిన జగన్…!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని మరోసారి చావు దెబ్బకొట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతీసిన జగన్…స్థానిక ఎన్నికలకు ఆదిలోనే ఊహించని దెబ్బ కొట్టారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కోర్టు అంగీకరించనప్పటికీ పార్టీపరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీనిపైన కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అని కోర్టు ఆదేశించింది. దీంతో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో చంద్రబాబు నాయుడు తనదైన రాజకీయం మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో నాటకాలు ఆడారని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే చిత్తశుద్ధి జగన్ కి లేదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు.

ఇదిలావుడగా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు కేసులు వేయడం వల్లే బిసి రిజర్వేషన్లు తగ్గిపోయాయని విమర్శిస్తూ వచ్చిన వైసిపి….అనూహ్య నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు అధికారికంగా 24 శాతం రిజర్వేషన్లు బీసీలకు కలిగించినప్పటికీ…మరో 10 శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా కేటాయిస్తామని జగన్ ప్రకటించారు. ఇది కచ్చితంగా రాజకీయంగా టిడిపికి చావుదెబ్బ వంటిదే.

తమది బీసీల పార్టీ అని తెలుగుదేశం చెప్పుకుంటుంది. తమ పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తామని కూడా చంద్రబాబునాయుడు పదేపదే చెబుతుంటారు. అయితే జగన్ లాగా సాహసోపేత నిర్ణయం చంద్రబాబు తీసుకోలేకపోయారు. చట్టంతో‌ సంబంధం లేకుండా తమ పార్టీ బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తామని చెప్పలేకపోయారు. కోర్టు ఆదేశాలను రాజకీయంగా ఉపయోగిం చుకున్నారు తప్ప…బిసిలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో చంద్రబాబుకు బిసిల పట్ల చిత్తశుద్ధి లేదని‌ మరోసారి‌‌ రుజువయింది. ఇప్పుడు తాము కూడా బిసిలకు 34 శాతం ఇస్తామని చంద్రబాబు ప్రకటించినా దానివల్ల ప్రయోజనం ఉండదు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*