చంద్రబాబుపై‌‌‌ దిశ కేసు పెట్టాలి : శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డి

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి‌‌ శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.‌ చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన దిశాచట్టం కేసు నమోదు చెయ్యాలని అన్నారని, అయితే మొట్టమొదటగా దిశాచట్టం మీద కేసు నమోదు చెయ్యవలసింది చంద్రబాబు పైనే‌ అని అన్నారు. తెలుగుదేశం మహిళా పెయిడ్ ఆర్టిస్టులను నామినేషన్ జరుగుతున్న కార్యాలయం వద్దకు పంపి లేనిపోనీ గందరగోళం స్తృష్టించారని విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే….

  • చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిరామచంద్ర రెడ్డి గారికి మంచి పేరు ఉంది జిల్లాలో అందరూ ఆయ్నను పెద్దాయన అని పిలుచుకుంటారు. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కి పెద్దాయన రామచంద్ర రెడ్డి గారి క్యారెక్టర్ కి నక్క కి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడుని ఎవరు పెద్దాయన అని పిలవరు వెన్నుపోటు దారుడు అని పిలుస్తారు.
  • చంద్రబాబు నాయుడు నువ్వు వస్తావో లేకా నీ కొడుకు వస్తాడో రండి… నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా…కుప్పం లో కానీ చంద్రగిరి లో కానీ చివరకు మా శ్రీకాళహస్తిలో కానీ నువ్వు మా పెద్దాయన పోటీ చేయండి.. నీకు డిపాజిట్లు వస్తే నేను రాజకీయం వదిలేస్తా. నన్ను ఉన్మాది అంటావా నువ్వు ఉన్మాది , పుష్కరాల్లో నీ పబ్లిసిటీ కోసం అక్కడ వచ్చిన భక్తులను పొట్టన పెట్టుకున్న పెద్ద ఉన్మాది నువ్వు, నీ కొడుకు.
  • ఇంకా మాట్లాడుతూ బొజ్జల గంగి సుబ్బరామి రెడ్డి, బొజ్జల గోపాల్ రెడ్డి ,సుధీర్ రెడ్డి గొప్ప చరిత్ర అంటావా మరి అంతా చరిత్ర కలిగిన వారు స్థానిక ఎన్నికల్లో క్యాండిట్లను ఎందుకు పెట్టుకోలేకపోయారు..ఎందుకంటే మిమ్మలని చూసి వోట్లు వేసే వాళ్ళు లేరు. మీకు డిపాజిట్లు కూడా రావు. అందుకే నామినేషన్ తరువాత రోజే మీ వాడు ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు.
  • 30 సంవత్సరాలగా శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల కుటుంబం చేయలేని అభివృద్ది నేను గెలిచిన 9 నెలలోనే చేసి చూపించాను. దాదాపు 200 కోట్ల రూపాయలతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నూతన సిసి రోడ్లు మురికి కాలువలు వేయించిన ఘనత మా ప్రభుత్వానిది. అలాగే దాదాపు 75% పనులను ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ఇచ్చిన ఘనత మాదే అని గర్వంగా చెప్పుకుంటున్నాను .
  • ఈరోజు BJP నాయకులు కన్నా లక్ష్మి నారాయణ గారు మాట్లాడారు. వారి పార్టీ మంచిదే. కానీ వారి చుట్టూ ఉన్న వారు మంచి వారు కారు. ఎదైనా మాట్లాడే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉండి, మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయుకులను, కార్యకర్తలను నిజాలు అడిగి తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేది.
  • కన్నాలక్ష్మి నారాయణ గారూ మీకు నా గురుంచి అబద్దాలు చెప్పినోడికి దేవుడంటే భయం, బిడ్డలంటే ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం రెండు ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి డబ్బు నేను రూపాయి తిన్నా, చివరకు గుడిలో ప్రసాదం తీసుకున్నా, కండువ వేసుకున్ననా… సొంత డబ్బు చెల్లించి వస్తాను. మొన్న శివరత్రి రోజు పంచిన పండ్లకు కూడా నా డబ్బు 20,000 రూపాయలు చెల్లించాను. శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి డబ్బు తిన్నవాడు సర్వనాసనం అయిపోతాడు చివరకు మధుసూదన్ రెడ్డి కూడా.
  • మొన్న జరిగిన ఎన్నికల స్క్రూట్ నీ రోజు జరిగిన గొడవలకు కారణం ఎవరో శ్రీకాళహస్తి ప్రజలందరికీ తెలుసు. డిఎస్పీ, సిఐలపైన పైన ఎవరు చెయ్యి చేసుకొని రౌడీయిజం చేశారో ప్రజలందరూ చూశారు. అసలు తొట్టంబేడులో టౌన్ వారికి ఏమి పని. గొడవలు సృష్టించడం కోసం అక్కడికి వెళ్ళి మా కార్యాలర్తలను రచ్చగొట్టే విధంగా మాట్లాడి గొడవలు పడి, చివరకు మా వారి పైన కేసులు నమోదు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*