చంద్రబాబుపై కేసు నమోదు..!

Nara Chandrababu Naidu

ధర్మచక్రం ప్రతినిధి – విజయవాడ

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారు. భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు  లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు కారణమయ్యారని లాయర్‌ శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసుల నమోదు చేశారు. 

లాక్ డౌన్ సమయంలో‌‌ వైసిపి ఎంఎల్ఏలు రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డి, వెంకటేగౌడ తదితరులు ప్రజలకు నిత్యావసర సరుకులు వంటివి సరఫరా చేసిన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలయింది.‌ దీనిపైన సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలంటూ కోర్టు వ్యాఖ్యానించిన‌ సంగతి తెలిసిందె. ఇంతలోనే అదే తరహా అభియోగాలతో చంద్రబాబు మీద కేసు హైకోర్టుకు వెళ్లింది. ఈ దశలో ఇటువంటి అంశాపలపైన స్థానికంగా ఉండే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోర్టు చెప్పింది. ఈ క్రమంలోనే చంద్రబాబుపై కేసు నమోదయింది.

ఇదిలావుండగా లాక్ డౌన్ కు ముందు హైదరాబాదు వెళ్లిన చంద్రబాబు అక్కడే ఉండిపోయారు. విశాఖ గ్యాసు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ, ఏపి పోలీసులను కోరారు. ఆ అనుమతులపై వచ్చిన ఆయన విశాఖకు వెళ్లకుండా… అమరావతిలో మహానాడులో పాల్గొని తిరిగి హైదరాబాదు వెళ్లిపోయారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*