చంద్రబాబుపై జగన్ కొత్త తవ్వకాలు…. ఏం బయట పడుతుందో….

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏర్పాటు చేసింది. ఇది అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పైన మాత్రమే గాక ఇతర అక్రమాలపై నా దృష్టి సారించనుంది. అప్పట్లో జరిగున ఏ నిర్ణయంలోనైనా అక్రమాలు జరిగాయని భావిస్తే దానిపైన చిచారణ చేపట్టే అధికారం సిట్ కు ఉంది. అమరావతి భూములపై ఇప్పటికే సిట్ తన పని మొదలుపెట్టింది.

ఇప్పుడు ప్రభుత్వం మరో అంశంపైనా దృష్టి పెట్టింది. అదే విజయనగర రాజులైన పూసపాటి వంశీయులకు చెందిన మన్సాస్ ట్రస్టు వ్యవహారం. ఇప్పటి దాకా ట్రస్ట్ ఛైర్మన్ గా ఉన్న మాజీ ఎంపి పూసపాటి అశోక గజపతిరాజు అన్న పూసపాటి ఆనందగజపతి రాజు కుమార్తె అయిన సంచయితను అనూహ్యంగా తెరపైకి తెచ్చి‌ ఆమెను ట్రస్టు ఛైర్ పర్సన్ గా నియమించింది జగన్ ప్రభుత్వం.

ఆనంద గజపతిరాజు మరణానంతరం… లక్ష కోట్లకుపైగా ఆస్తులు కలిగిన మన్సాస్ ట్రస్టు బాధ్యతలు చేపట్టిన అశోక గజపతి రాజు చక్రం తిప్పుతున్నారు. ఆయన కూతురు అదితి కూడా ట్రస్టు సభ్యురాలిగా ఉన్నారు. ఆశ్చర్యం ఏమంటే….అశోక గజపతి రాజు కుమార్తెలుగానీ, సోదరిగానీ ఎవరూ ట్రస్టులో సభ్యులుగా లేరు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపి కుటుంబరావును ట్రస్టులో సభ్యునిగా చేర్చారు.

ఈ నేపథ్యంలోనే…తాజా పరిణామాలను చూడాలి. పూసపాటి వంశీకులను కాదని బయటివారిని సభ్యులుగా పెట్టడంతోనే ఇందులో ఏదో గూడుపుఠాణీ ఉందన్న అనుమానం కలిగించింది. ఈ ట్రస్టులో భారీ అక్రమాలు జరిగాయన్న సందేహాలున్నాయి. అందుకే జగన్ ప్రభుత్వం మాన్సాస్ ట్రస్టు మీద దృష్టి సారించింది.

ఈక్రమంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ముందుగా అశోక్ గజపతి రాజును ఛైర్మన్ పదవి నుండి తప్పించింది. ఆ స్థానంలో ఆయన అన్న కుమార్తె అయిన సంచయితను తీసుకొచ్చి ట్రస్టు ఛైర్ పర్సన్ గా నియమించారు. అదేవిధంగా ఆనంద జగపతి రాజు మరో కుమార్తె ఊర్మిళా గజపతి రాజును, ఆశోక్ – ఆనంద గజపతి రాజుల సోదరి అయిన సునీతను బోర్డు సభ్యులుగా నియమించారు. ఇదే సమయంలో అశోక గజపతి రాజు కుమార్తె అదితిని సభ్యురాలిగా కొనసాగిస్తున్నారు. అలాగే స్థానిక ఎంఎల్ఏ, ఎంపిని కూడా సభ్యులుగా పెట్టారు.

ఇదంతా…ట్రస్టులో గతంలో జరిగిన అక్రమాలను బయటకు తీయడమే లక్ష్యమని తెలుస్తోంది. ట్రస్టుకు దాదాపు 14,000 ఎకరాల భూములున్నాయి. ఈ భూములు పదిలంగా ఉన్నాయా అనేది తెల్చనున్నారు. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయం కోసం ప్రభుత్వం తీసుకున్న ఆ ట్రస్టు భూములకు పరిహారం ఎవరికి ఇచ్చారనే అంశమూ చర్చనీయాంశంగా ఉంది.

ఈ పూర్వరంగంలో మాస్సాస్ ట్రస్టు వ్యవహారాలై లోతయిన విచారణ జరిగితే… ఎలాంటి వాస్తవాలు బయట పడుతాయనేది ఆసక్తికరంగా మారింది. ట్రస్టు పైనా సిట్ విచారణ జరుపుతుందా లేక కొత్తగా ఏదైనా ఏజెన్సీకి విచారణ అప్పగిస్తారా అనేది వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*