చంద్రబాబు అనుకూల మీడియాపై భగ్గుమన్న నాగబాబు..!

చిరంజీవి, పవన్ కల్యాణ్ సోదరుడైన నాగబాబు…ఈమధ్య తరచూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా చంద్రబాబు అనుకూల మీడియాపైన, ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నాయకత్వంలో పలువురు సినీ పెద్దలు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. దీనిపైన టిటిడి అనుకూల మీడియా చిరంజీవిపై విరుచుకు పడుతోంది. రాజధాని రైతులు 175 రోజులుగా ఆందోళన‌ చేస్తున్నా చిరంజీవికి పట్టదా…రైతులను ఉద్ధరించేది సినిమాల వరకేనా అంటూ‌ ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది.ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు.

నాగబాబు ఏమన్నారంటే….
టీడీపీ జెండాని అజెండాని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని, టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం, మనవాడు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం, మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం, మనబాబుకి ఉపయోగపడినంత కాలం…ఓడ మల్లయ్య అని,, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ…బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, బాబుగారికి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దుచేసే వారి మమతానురాగాలు… వావ్… ఇది అసలైన వార్తా…పత్రికల స్పిరిట్ అంటే..శభాష్… ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని డౌట్ వస్తుందేంటి..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*