చంద్రబాబు ఆశించినదే….జగన్‌ చేశారా..!

ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విశాఖ విమానాశ్రయంలోనే వైసిపి శ్రేణులు, విశాఖను పరిపానా రాజధానిగా కోరుకుంటున్న వారు అడ్డుకున్నారు. నాుళుగైదు గంటల హైడ్రామా అనంతరం చంద్రబాబు నాయుడు విమానాశ్రయం నుంచే వెనుదిర గాల్సివచ్చింది. ఇదంతా చూసిన తరువాత సరిగ్గా ఏడాది క్రితం అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎదురయిన అనుభవం అందరికీ గుర్తుకొచ్చింది. ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా గత ఏడాది జనవరిలో జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖపట్నాకి వెళ్లారు. అయితే…ఆయన్ను పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. రన్‌వేపైకి వెళ్లి మరీ అరెస్టు చేశారు. కనీసం విమానాశ్రయం నుంచి అడుగు బయట పెట్టనీయలేదు. వినామాశ్రయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, ఇక్కడ రాష్ట్ర పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని జగన్‌ నిదీసినా సరైన సమాధానం పోలీసుల నుంచి రాలేదు. దీంతో జగన్‌ మోహన్‌ రెడ్డి వెనుదిరగాల్సి వచ్చింది. విమానా శ్రయంలోకి చొచ్చుకెళ్లి జగన్‌ను అరెస్టు చేసిన చర్యను చంద్రబాబు ప్రభుత్వం సమర్ధించుకుంది.

ఇప్పుడు ఇదే అనుభవం చంద్రబాబుకు ఎదురయింది. అయితే….కాస్త రూల్స్‌ను పాటించారు. వినామాశ్రయంలోకి వెళ్లకుండా…చంద్రబాబు నాయుడే బయటకు వచ్చిన తరువాత ముందుకు వెళ్లనీకుండా పోలీసు అపేశారు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబూ గోబ్యాక్‌ అంటూ వేలాది మంది అప్పటికే విమానాశ్రయం ముందు మోహరించిన పరిస్థితుల్లో….చంద్రబాబు నాయుడు తన యాత్రను కొనసాగిస్తే శాంతిభద్రత సమస్య తలెత్తుతుందని చెప్పి పోలీసులు ఆయన్ను ఆపేశారు. అయినా నాలుగు గంటకులపైగా చంద్రబాబు విమానాశ్రయం ఎదుటే ఉండిపోయిన…. కొంతసేపు అక్కడే బైఠాయించారు. పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు చెప్పడంతో వెనుదిరిగారు.

ఏదైతేనేమి….ఆనాడు జగన్‌ మోహన్‌ రెడ్డిని ఏ విధంగానైతే వినామాశ్రయం నుంచి వెనక్కి పంపించారో….ఈ రోజు చంద్రబాబు నాయుడు అదే రీతిలో విశాఖపట్నంలోకి అడుగుపెట్టకుండా వెనుదిరగాల్సివచ్చింది. ఇదే విషయాన్ని విలేకరులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినపుడు…ఆ రోజు విశాఖలో పెట్టుబడుల సదస్సు ఉండటం వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందన్న భావనతో అడ్డుకున్నామని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు జగన్‌ ప్రభుత్వం కూడా ఇదే మాట చెబుతోంది. విశాఖను పాలనా రాజధానిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తే….అక్కడి వారు ఆందోళనకు దిగుతారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అందుకే చంద్రబాబు రక్షణ కోసమే తిప్పి పంపించామని పోలీసులు చెబుతున్నారు.

తమ నేత జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎటువంటి అవమానమైతే జరిగిందో…అదేచోట, అదే తరహా అవమానం చంద్రబాబుకు జరిగినందుకు వైసిపి శ్రేణులు సంతోషంగా ఉండొచ్చుగానీ….ఈరోజు విశాఖలో విశాఖలో జరిగిన ఉదంతం వల్ల అధికార పార్టీకి ఎంతోకొంత నష్టమని చెప్పాలి. ఒక విధంగా చెప్పాంటే తన పర్యటన ద్వారా చంద్రబాబు ఏదైతే ఆశించారో….అదే జరిగిందని అనుకోవాలి. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు….ఆ నిర్ణయం తరువాత తొలిసారి ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. విశాఖలో రాజధానిని వ్యతిరేకిస్తానని ఆయన అంత గట్టిగా చెప్పుకోలేరు. అలాగని సమర్ధించలేదు. ఒక విధంగా చంద్రబాబుకు ఉత్తరాంధ్ర పర్యటన కత్తిమీద సామువంటిదే. అయితే….అడ్డుకుని వెనక్కి పంపడం వల్ల మొత్తం వ్యవహారం పక్కదారి పట్టినట్లయింది. రాజధాని విషయం పక్కకెళ్లి ఆయన్ను అడ్డుకోవడమే ప్రధాన అంశంగా మారింది. ఇటువంటి పరిస్థితి తలెత్తినా తమకు మేలేనని తొగుదేశం అంచనా వేసివుంటుంది. అందుకే… విమానాశ్రయం వద్ద అన్ని గంటు హైడ్రామా నడిపించారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పర్యటనపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

  • ఆదిమూం శేఖర్‌, సంపాదకు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*