చంద్రబాబు ఓ గజినీ…ఓ ఖీల్జీ!

తిరుమల శ్రీవేంకటేవ్వరస్వామి తమ ఇంటి కులదైవమని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలయ వ్యవహారాలలో మితిమీరి జోక్యం చేసుకుంటూ…తరతరాల ఆలయ సంప్రదాయలను మంటగలుపుతున్నారని వైసిపి సీనియర్‌ నాయకులు, టిటిడి మాజీ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చుపెట్టినట్లే…దైవ స్వరూపులైన శ్రీవారి ఆలయ అర్చకుల మధ్య ఆరని మంటలు రాజేశారని ఆరోపించారు. వందల ఏళ్ల నుంచి శ్రీవారిని అర్చిస్తూ స్వామి సేవలో తరిస్తున్న నాలుగు వంశపారంపర్య అర్చుకులను శ్రీనివాసునికి దూరం చేయడం ద్వారా…ఆ అర్చకుల తలలు నరికేశారని అన్నారు. ఇలా చేయగలిగింది గజనీలు…ఖాల్జీలు మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపించాల్సిందిపోయి…పాత జీవోలను బయటకు తీసి ఆయన్ను పనిలోంచి తొలగించడం ఏ ధర్మమని ప్రశ్నించారు. మీకు ప్రధాన అర్చక పదవులు దక్కాలంటే…65 ఏళ్లు దాటిన వారిని తొలగించాలంటూ మిగిలిన అర్చకులకు ప్రలోభపెట్టిన టిటిడి…నిజంగా తలచుకుంటే ఇంకో నలుగురికి అలాంటి పోస్టులు ఇవ్వకూడదనా అని ప్రశ్నించారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై ఆయన కోరుతున్నట్లు సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నిర్ణయాలను సమీక్షించి….రమణ దీక్షితులుతో పాటు ఇప్పుడు ఆ హోదాలు కోల్పోయిన అర్చకులను తిరిగి అదే స్థానాల్లో నియమిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే ఏదైనా ఏజెన్సీతో విచారణ జరిపిస్తే సరిపోదా అని ధర్మచక్రం అడిగిన ప్రశ్నకు….’రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి అయితే…రాష్ట్ర ప్రభుత్వం ఎలా విచారణ జరిపిస్తుంది. ఇంకా నయం చంద్రబాబునే విచారణ జరిపించమనలేదు’ అని వ్యాఖ్యానించారు. ఏదైనా నిష్పాక్షిక కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

1 Comment

  1. Wrong opinion by the ex chairman. Let the CBI team comprising of EO cadre officers of other temples of other States would bring out fair facts which can be reviwed/analysed by a special team at Spreme Court again will be appropriate.

Leave a Reply

Your email address will not be published.


*