చంద్రబాబు పనిచేసేది 3 గంటలేనా!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు తరచూ రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా అనడంకంటే నిప్పులు కక్కుతున్నారని అనడం సమంజసంగా ఉంటంది. ‘ఇది ఎవరి అమరావతి’ అంటూ రాష్ట్ర రాజధానిపై ఒక పుస్తకాన్నే ఆయన రాసి ప్రచురించారు. అమరావతి ప్రజా రాజధాని కాదని, దీని వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. రాజధానికి 32 ఎకరాలు ఎందుకని ప్రశ్నిస్తూ….ప్రపంచంలోని వివిధ దేశాలు, రాష్ట్రాల రాజధానుల అనుభవాలను వివరించారు. ఇంకా వీలు దొరికనపుడల్లా ముఖ్యమంత్రి లేఖలు రాయడం వంటి చర్యలతో ఎప్పడూ వార్తల్లో ఉంటున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమంటే…శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును ఆ పనిలోంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఏ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవైఆర్‌ మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అర గంటలో చేయాల్సిన పనిని 4 గంటలు చేస్తారని; పని జరగడం కంటే తాను పని చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడమే ఆయనకు కావాల్సిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడేమో తరచూ ‘నేను రాష్ట్రాభివృద్ధి కోసం 24 గంటలూ పని చేస్తాను’ అని చెబుతుంటారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే మాట చెప్పేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐవైఆర్‌ ఎద్దేవా చేసినట్లున్నారు. ఈ మాజీ ఐఏఎస్‌ అధికారి చెబుతున్న లెక్క ప్రకారం రోజుకు ముఖ్యమంత్రి చేస్తున్న పని 3 గంటలే అన్నమాట. రోజుకు 24 గంటలు. బాబు నాలుగు గంటలు పని చేస్తే అర్థగంట పని చేసినట్లుని ఐవైఆర్‌ చెబుతున్న లెక్క. దీని ప్రకారం లెక్కిస్తే 3 గంటలు వచ్చింది. మీరూ లెక్కించుకోవచ్చు.

2 Comments

  1. Working how many hours is not the matter but why do he comment that now?? Being an ex secretary of the State, is not responsible to educate and set right the society? Simply drawing pension and commenting on others is not a stand of an IAS officer. If anything he feel let him come out with positive and constructive methods of working, not only for CM but also all officers atleast in the State. Regards to him and all the readers.

Leave a Reply

Your email address will not be published.


*