చంద్రబాబు ప్రాణాలు కాపాడుకోడానికి గాజు గదిలో కూర్చున్నారు…కరోనా కంటే యల్లో వైరస్ ప్రమాదం : కొడాలి నాని ఫైర్

కరోనా వైరస్ కు భయపడి 70 ఏళ్ల వయసులో ప్రాణాలు కాపాడుకోవాలన్న తాపత్రయంతో, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… ఆంధ్రప్రదేశ్ ప్రజలను గాలికి వదిలేసి, హైదరాబాద్ కి వెళ్లి గాజు గదిలో దాక్కున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఘాటైన విమర్శలు చేశారు. ఆయన అమరావతిలో‌ మీడియాతో మాట్లాడారు.‌

ఒక వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోతే…రేషన్ సరుకుల కోసం లైనులో నిలబడి చనిపోయిందంటూ టిడిపి నాయకులు, టిడిపి అనుకూల మీడియా దుష్ప్రచారం చేశారని అన్నారు. ఒకప్పుడు వాలంటీర్ల వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన వాళ్లే ఇప్పుడు వాలంటీర్లతో బియ్యం డోర్ డెలివరీ చేయాలని డిమాండ్ చేయడం వింతగా ఉందన్నారు. బియ్యాన్ని ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేసి, వాటి‌ని డోర్ డెలివరీ చేయాలన్నది తమ లక్ష్యమని, అందుకు ఇంకా సమయం పడితుందన్నారు. చివరి లబ్ధిదారునికీ సరుకులు‌ అందుతాయని, ఎవరో లైనులో నిల్చోవాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు.

కరోనా విపత్తు సమయంలోనూ చంద్రబాబు నాయుడు కుళ్లు రాజకీయాలు చేయడం మానుకోలేదన్నారు. కరోనా వైరస్ కంటే యల్లో వైరస్ ప్రమాదకరంగా మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబు తన ప్రాణాలను కాపాడుకోడానికి…ప్రజలను‌ గాలికొదిలేసి కుటుంబంతో పాటు హైదరాబాద్ వెళ్లి కూర్చున్నారని విమర్శించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*