చంద్రబాబు ‌అవకాశవాదాన్ని బట్టబయలు చేసిన కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి..!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అవకాశవాదాన్ని సోదాహరణగా ఎండగట్టారు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కాశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు అనంతరం…అమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా సహా… అక్కడి నేతలను నెలల తరబడి గృహ నిర్బంధంలో వుంచిన సంగతి‌ తెలిసిందే. కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడిన అనంతరం… తొలిసారి ఒమర్ అబ్దుల్లా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ‌ ఇంటర్వ్యూలో చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఓడిపోతారని, జగన్ మోహన్ రెడ్డి గెలవబోతున్నారని బాబుకు తప్ప అందరికీ తెలుసు. అయినా….చంద్రబాబు పిలిచారని, మా నాన్న ఫరూక్‌ అబ్దుల్లా తన లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని పక్కనబెట్టి, ఏపికి వెళ్లి టిడిపి కోసం ప్రచారం చేశారు.‌ అయితే…మేము కష్టాల్లో ఉంటే…మాకు మద్దతుగా చంద్రబాబు ఒక్కమాట మాట్లాడలేదు…అని ఒమర్ అబ్దుల్లా చంద్రబాబు తీరును బట్టబయలు చేశారు.

చంద్రబాబు గురించి ఒమర్ అబ్దుల్లా చెప్పిన మాటలు

మొన్నటి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేసిన హడావుడి అంతాఇంతా కాదు.‌ బిజెపిని ఓడించడం చారిత్రక అవసరమని ప్రచారం చేశారు. కాంగ్రెస్ తో కలిసి, దేశంలోని బిజెపియేతర పార్టీలను ఒకతాటిపైకి తెస్తానంటూ దేశమంతా తిరిగారు. జాతీయ స్థాయిలో పలు సమావేశాలు కూడా నిర్వహించారు. అవకాశముంటే ప్రధాని అవుతారన్న ప్రచారామూ ఊదరగొట్టారు. చంద్రబాబు గెలుపు కోసం కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ తదితరులు వచ్చి‌ ప్రచారం చేశారు.

ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో బిజెపి తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ చంద్రబాబు ఘోర పరాజయాన్ని కూడగట్టుకున్నారు. అంతే…ఆయన స్వరం మార్చేశారు. బిజెపిని వ్యతిరేకించాల్సింది కాదంటూ పల్లవి అందుకున్నారు. ఆ పార్టీ నాయకత్వానికి దగ్గరయ్యేందుకు నానాతంటాలు పడుతున్నారు.

ఒమర్ అబ్దుల్లా

ఇక ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రాల నేతలను తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్న చంద్రబాబు…ఆ తరువాత వాళ్లు కష్టాల్లో ఉన్నపుడు మాట మాత్రంగానైనా సపోర్టు ఇవ్వకపోగా…. ఆ కష్టాలకు కారణమైన బిజెపిని మద్దతు ప్రకటించారు. కాశ్మీర్ విషయంలో స్వయం ప్రతిపత్తి రద్దును టిడిపి సిద్ధాంతపరంగా సమర్థించవచ్చు. అయితే…తన రాజకీయ మిత్రుడిగా ఉన్న అబ్దుల్లా కుటుంబం నెలల తరబడి గృహ నిర్బంధంలో ఉంటే పట్టించుకోలేదు. కనీసం వాళ్లను చూడాలని అనికూడా అనుకోలేదు. కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు సుప్రీం కోర్టు‌ ద్వారా అనుమతి తీసుకుని కాశ్మీర్‌ వెళ్లివచ్చారు.‌ చంద్రబాబు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అదేవిధంగా పలు అంశాల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్రంతో విభేదాలొచ్చాయి. ఆమెకూ చంద్రబాబు మద్దతు ఇవ్వలేదు.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల్లోని మిత్ర పార్టీల విశ్వాసాన్ని కూడా కోల్పోయారు. ‌ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇక జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసే అవకాశాన్ని ఆయనే పోగొట్టుకున్నారు. – ధర్మచక్రం ప్రతినిధి

మొయిన్ ఫొటో : 2019 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి ఏపిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఫరూక్ అబ్దుల్లా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*