చచ్చిన కుక్కల్ని ఈడ్చినట్లు ఈడ్చి…గుంతలోకి విసిరి…కుప్పగా వేసి…పూడ్చేశారు..! కరోనా మరణం కంటే‌ విషాదం ఏముంటుంది..!!

కరోనా వస్తుందని భయం కంటే..‌.ఒకవేళ కరోనారో మరణం సంభవిస్తే…మృతదేహం పట్ల వ్యక్తుల ప్రవర్తన ఎలావుంటుందో తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పటికే జరిగున కొన్ని ఉదంతాలు చూస్తే…ఎలా మరణించినా పర్వాలేదుగా‌నీ…కరోనాతో మాత్రం మరణించకూడదన్న భావన తప్పక కలుగుతుంది.

కర్నాటక రాష్ట్రం బళ్లారిలో ఒకేరోజు ఎనిమిది మంది కరోనాతో మరణించారు. వీరి మృతదేహాలను వాహనంలో శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శవాలను వాహనాల నుంచి‌ లాగి కిందపడేశారు. ఆపై బరబరా లాగి, గుంతలో వేసారు. అన్ని మృతదేహాలనూ ఒకే గొయ్యలో వేసి పాతిపెట్టారు. అమానవీయంగా జరిగున ఈ తంతుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో పెద్ద దుమారం రేగింది.

కరోనాతో మరణించిన వారి భౌతిక దేహాలకు…ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతుల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించాలి. మరోనా మరణించిన వారి దేహాలను బంధువులకు అప్పగించరు. ప్రభుత్వ అధికారులే దగ్గరుండి దహనమో, ఖననమో చేయాలి. మరణించిన వారి గౌరవానికి భంగం వాటిల్లకుండా ఇదంతా చేయాలి.

అయినా బళ్లారి వంటి ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో ఓ వృద్దుడు మరణిస్తే, అతని భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు చేయడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకురాలేదు. దీంతో పోలీసులు, అధికారులే ఆ తంతు పూర్తి చేశారు. ఇటువంటి మృతదేహాల ఖననాన్ని అడ్డుకున్న ఘటనలను తమిళనాడులో చూశాం.

ఎక్కడో ఇటలీలోనో, అమెరికాలోనో ఇటువంటి ఘటనలు జరిగాయని వార్తలొస్తే అయ్యో అన్నాం. ఇప్పుడు మన కళ్ల ముందరే జరిగిపోతున్నాయి. రానున్న రాజుల్లో ఇంకెన్ని దారుణాలు చూడాల్సివస్తుందో..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*