చిత్తూరు జిల్లాలో మరో 14 కరోనా కేసులు : రాష్ట్ర వ్యాపితంగా 57 కేసులు..!

ప్రభుత్వం శుక్రవారం ‌(15.05.2020) ఉదయం 10 గంటలకు విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం చిత్తూరు జిల్లాలో కొత్తగా 14 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 13 కేసులు కోయంబేడు మార్కెట్ తో సంబంధం ఉ‌న్నవే. ఇప్పటి దాకా చిత్తూరు జిల్లాలో 165 కేసులు నమోదు కాగా 77 మంచికి ఆరోగ్యం బాగుపడి ఆస్పత్రి నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. 88 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదిలావుండగా…రాష్ట్ర వ్యాపితంగా కరోనా కేసుల సంఖ్య 2157కు పెరిగింది. ఇందులో తాజాగా నమోదైన 57 కేసులు కూడా ఉన్నాయి. తాజా కేసుల్లో చిత్తూరు 14, నెల్లూరు 14, కృష్ణా 9, కర్నూలు 8 , అనంత 4, కడప 2, విశాఖ 2, విజయనగరం ‌3, తూర్పు గోదావరి 1 కేసు ఉన్నాయి. తాజా కేసుల్లో 28 కేసులకు కోయంబేడు నేపథ్యం‌ ఉంది.

రాష్ట్రంలో ఇప్పటి దాకా 1252 మంది డిచ్చార్జ్ అయ్యారు. 857 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనాతో 48 మంది ప్రాణాలు కోల్పోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*