చిత్తూరు జిల్లాలో 100 దాటిన కరోనా కేసులు

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతి

చిత్తూరు జిల్లాలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన తరుణ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం పది గంటలకు ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 112కు చేరుకుంది. తాజాగా 16 కేసులు నమోదయ్యాయి. శనివారం 11 కేసులు వచ్చి చేరాయి. దీంతో రెండు రోజుల్లోనే 27 వచ్చినట్లయింది. ఈ 16 కేసులలో నాగలాపురం 05, వి. కోట 03, విజయపురం లో 02, పిచ్చాటూరు 02, నగరి 01, మదనపల్లి 01, ములకలచెరువు 01, రామసముద్రం 01 కేసులు ఉన్నాయి.

చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఉన్న చెన్నై కోయంబేడు మార్కెట్ లో కరోనా కలకలం‌ రేపుతున్న‌ సంగతి తెలిసిందే. అక్కడ వందల మందికి పాజిటివ్ వచ్చింది. చిత్తూరు జిల్లా నుంచి ఈ రోజు కోయంబేడు మార్కెట్ కూరగాయలు తీసుకెళ్లే‌ వ్యాపారులు, రైతులు వందల మంది ఉన్నారు. దీంతో చిత్తూరు జిల్లా వాసులు చాలామంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు బయట పడుతున్న కేసులు దాదాపు అన్నీ కోయంబేడు మార్కెట్ తో లింకులు ఉన్నవే అని‌ అధికారు చెబుతున్నారు.

జిల్లాలో వ్యాధి సోకిన వారిలో 74 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 38 మంది చికిత్స పొందు తున్నారు.‌ రెండు రోజుల్లో వచ్చిన 27 కేసులు లేకుంటే…11 మంది మాత్రమే చికిత్స పొందుతున్న జాబితాలో ఉండేవారు. (ఇక రాష్ట్రం ఏ జిల్లాలో ఎన్న కేసులు ఉన్నాయో కింది టేబుల్ లో చూడొచ్చు.)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*