చిత్తూరు జిల్లా మాండలికం నేర్చుకుంటున్న అల్లు‌ అర్జున్…ఎందుకో తెలుసా…!

సినీ నటుడు అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా మాండలికం నేర్చుకుంటున్నారట. ఎందుకు నేర్చుకుంటుమ్నారో చెప్పేముంది…రెండు మాటలు చెప్పాలి.

చిత్తూరు మాండలికమే కాదు…సీమ యాసలో తెలియని మాధుర్యం, సొంపులు ఉన్నాయి.‌‌ అందుకే…సీమ‌‌ మాండలికమంటే అందరికీ ఇష్టం. ప్రముఖ‌ క్యారెక్టర్ ఆర్టిస్టు జయప్రకాష్ రెడ్డి చాలా సినిమాల్లో సీమ మాండలికంలో పలికిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు విలన్లకే పరిమితమైన‌ సీమ యాస అడపాదడపా హీరోలకూ వాడుతున్న పరిస్థితులు వచ్చాయి.

అగ్ర హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ కూడా తన సినిమా కోసం‌‌ చిత్తూరు జిల్లా మాండలికం నేర్చుకుంటున్నారట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ చిత్తూరు మాండలికంలోనే మాట్లాడతారట. అందుకే… యాసలోని ఒంపుసొంపులను ఒడిసి పట్టుకునేందుకు బన్నీ పెద్ద కసరత్తే చేస్తున్నారట. లాక్ డౌన్ తో దొరికిన సమయాన్ని ఇందుకోసం పూర్తిగా వాడుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. ఈ కసరత్తు‌ ఎంతగా ఫలిస్తుందో, చిత్తూరు యాస భాషలను‌ అల్లు‌ అర్జున్ ఎంత బాగా పలికాడో సినిమా విడుదలయ్యాక చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*