చెరకు రసంలో నీళ్లు కలిపి మోసం!

బిగ్ బాస్ హౌజ్ లో 16వ రోజు ఇంటి సభ్యులకు చెరకుల నుండి రసం పిండే టాస్క్ ఇచ్చారు. లగ్జరీ బడ్జెట్ లో భాగంగా ఇచ్చిన టాస్క్ లో కిరీటి టీం అడ్డదారి తొక్కుతూ బిగ్ బాస్ కు దొరికిపోయారు. చేతితో తిప్పే చెరకు గానుగలు ఏర్పాటు చేసి, ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విభజించారు. చెరకు రసం తీసి బాటిళ్లలో నింపాలి. ఈ క్రమంలో మొదటి ఆర్డర్ 50 బాటిళ్లు ఇచ్చారు. ఏ టీమూ లక్ష్యం చేరుకోలేకపోయింది. రెండూ ఆర్డర్ గా వంద బాటిళ్ల లక్ష్యం ఇచ్చారు. ఈ సందర్భంగా కిరీటి‌ టీంలోని గణేష్ రహస్యంగా నీళ్లు‌పట్టుకొచ్చి రసంలో కలిపారు. దీన్ని కెమెరాల్లో చూసిన బిహ్ బాస్ నీళ్లు కలిపిన బాటిళ్లను లెక్కలోకి తీసుకోవొద్దని సంచాలకులును ఆదేశించారు. ఇది నిజాయితీకి సంబంధించిన అంశంగా ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. ఈ వారం ఎలిమినేషన్ జాబితాలో ముందు వరుసలో ఉన్న కిరీటి, గణేష్ తప్పు చేసి దొరికిపోయిన ఈ టీంలోనే ఉన్నారు. ఇది కచ్చితంగా వాళ్లకు వచ్చే ఓట్లపైన ప్రభావం చూపే అవకాశముంది. వచ్చే శనివారం నాని కోర్టులోనూ ముద్దాయిలుగా నిలబడాల్సి రావొచ్చు. అయినా బిగ్ బాస్ ఇంటిలో 70 కెమెరాలు ఉన్న సంగతి సభ్యులు మరచిపోతున్నట్లు ఉన్నారు. ఆ ఇంటిలో ఏ మూలన జరిగేదైనా బిగ్ బాస్ కంటికి తెలిసిపోతుంది. ఇంట్లో ఏమి జరుగుతున్నదీ లోపల ఉన్నవారికి తెలియకపోవచ్చుగానీ బయట ఉన్నవారికి తెలిసిపోతుంది. ఈ విషయాన్ని గత వారం నాని కూడా సభ్యులకు చెప్పారు. అందుకే తాము కెమెరా కనుసన్నల్లో ఉన్నామని హౌజ్ మేట్స్ నిరంతరం గుర్తుంచుకోవాలి. ఇకనైనా ఆ స్పృహతో ఆడుతారేమో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*