చెవిరెడ్డి వారసుడొచ్చారు..!

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల బరిలోకి దించుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మోహిత్ రెడ్డిని ఎంపీటీసీగా గెలిపించి, తిరుపతి రూరల్ మండలానికి ఎంపీపీ చేయాలన్న ప్రణాళికతో పావులు కదుపుతున్నారు.

మోహిత్ రెడ్డిని తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి ఎంపీటీసీ-1 స్థానం నుంచి పోటీ చేయుచున్నారు. తన స్వగ్రామమైన తుమ్మలగుంటలోని ఎంపీటీసీ స్థానం రిజర్వ్ అవడంతో జనరల్ కేటగిరి స్థానం కోసం వెతికి పెరుమాళ్లపల్లిని ఖరారు చేసుకున్నారు. పెరుమాళ్లపల్లిలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి అన్ రిజర్వ్డ్ కేటగిరిలో అంటే జనరల్ ఉంది. ఈ స్థానం నుంచి మోహిత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.

పెరుమాళ్లపల్లిలో వైసిపికి తిరుగులేని బలముంది.‌ ఈ స్థానం నుంచి సునాయాసంగా గెలవగలమన్న నమ్మకంతోనే దీన్ని ఎంపిక చేసుకున్నారు.
తిరుపతి రూరల్ ఎంపీపీ పదవి జనరల్ కేటగిరీలో ఉంది. ఎంపీటీసీగా గెలుపొందాక మోహిత్ రెడ్డిని మండలాధ్యకున్ని చేయడానికి చెవిరెడ్డి వ్యూహం‌ సిద్ధం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*