చేసినా తప్పే…చేయకున్నా తప్పే…బిగ్ బాస్ చెప్పిందే తీర్పు!

బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లిన వారికి ఎంగ ప్రచారం లభిస్తుందోగానీ…అవమానాలకు మాత్రం కొదవలేదు.‌ ఇంటి సభ్యుల వ్యక్తి త్వాన్ని కించపరచడం వారంవారం సాధారణంగా మారిపోతోంది. ఏది చేసే నా తప్పే ఏది చేయకున్నా తప్పే. తలాతోకా లేని టార్గెట్ ఇవ్వడం, దాన్ని అలా చేశారు..ఇలా చేశారు..ఇలా చేసివుం డకూడదు…ఇలా చేసివుండ కూడదు…అంటూ నానితో జడ్జిమెంట్ ఇప్పించడం, తద్వారా వినోదం సృష్టించాల నుకోవడం ఎబ్బెట్టుగా ఉంటోంది. బిగ్ బాస్ ఇంట్లో సభ్యులు ఏది చేసినా కరెక్టే. ఎందుకంటే వాళ్ల మానసిక స్థితి అటువంటిది. ప్రేమ వ్యవహారాల విషయానికే వస్తే సామ్రాట్… సునయన మధ్య ఏదో జరుగుతోందని అనుమానాలు రేకెత్తించ్చింది నానీనే. అది తప్పు లేదుగానీ ఇంటిలోని వారు దాని గురించి మాట్లాడుకోవడం తప్పయిపోయిందట. తప్పు బిగ్ బాస్ ది అయితే ఇంటి సభ్యులకు సుద్దులు చెప్పారు నాని. అనుమానపు బీజాలు నాటింది మీరే అని నానీకి చెప్పకనే చెప్పారు బాబుగోగినేని. అసంబద్ధమైన కాన్సెప్ట్ తో కూడిన షోలో సంబద్ధత ఉండాలని అనుకోవడం ఏ విధంగా సరైనది అవుతుందో తెలియదు. లవర్స్ టాస్క్ లో సెక్యూరిటీ సరిగా చేయలేదన్నది నాని కామెంట్. వాళ్లు సరిగా చేస్తే షోలో చూపించడానికి కంటెంటే ఉండదు. అదే విషయాన్ని గోనినేని నాని ముఖాన చెప్పారు. అంతేగదా…సెక్యూరిటీ గార్డులు ప్రేమికులను కలవనీకుండా చేస్తే…ఇక చూపించేందుకు ఆ పాటలు, సరసాలు ఎక్కడ నుంచి వస్తాయి. ఇది తెలుసుకుని నాని ఆ ప్రస్తావన జోలికి వెళ్లకూడదు. తాము ఏమి చెప్పినా ఇంటి సభ్యులు తలూపాల్సిందే అన్నట్లు పస లేని పాయింట్లతో హౌజ్ మేట్స్ ను అవమానిస్తే…బిగ్ బాస్ నక్కజిత్తులు బయటపడిపోతాయి.

బిగ్ బాస్ ద్వంద్వ వైఖరికి మరో ఉదాహణ…ఇంట్లోకి వచ్చిన గంటలోనే ఇంటిలో ఉండటానికి అర్హులు కాని సభ్యుల పేర్లు చెప్పమని అడగటంలో అర్థం వుందా…ఇలాంటి బిగ్ బాస్ ఇప్పుడు గణేష్ ను నామినేట్ చేయడానికి సభ్యులు చెబుతున్న కారణం సమంజసంగా లేదట. ఇకపై ఆ కారణం ( ఒత్తిడిని తట్టుకోలేకున్నాడు) చెప్పకూడదని నాని హుకుం జారీ చేశారు. ఇది ఆట. అందులోనూ నక్కజిత్తుల ఆట. అలాంటప్పుడు సభ్యులు గెలవడానికి అన్ని వ్యూహాలనూ అనుసరించడానికి అవకాశం ఉంటుంది. బలమైన కారణం లేకున్నా పోటీగా ఉంటున్నారనుకున్న వారిని నానినేట్ చేయవచ్చు. నాని అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇంటి సభ్యులే కాదు..బిగ్ బాస్ ఎంత పద్ధతిగా ఉంటున్నారనేది కూడా ప్రేక్షకులు గమనిస్తారు. అందుకే సభ్యుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లటడకూడదు. ఉన్నంతలో సరదాగా ముగించాలి తప్ప…సీరియస్ నెస్ కోసం ఎలాగంటే‌ సభ్యులను జడ్జి వేయడం మానుకోవాలి. ఇందులో హోస్ట్ గా నాని పాత్ర చాలా కీలకమైనది. అవసరమైతే జూనియర్ ఎన్.టి.ఆర్. చేసిన మొదటి సీజన్ ఎపిషోడ్లన్నీ ఒకసారి నాని చూడాలి.

ఇక ఐదో వారంలోకి ప్రవేశించానికి ద్వారాలు తీసిన ఈ శనివారం చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేదు. సభ్యులను ఇష్టానుసారం జడ్జి చేయడం తప్ప నాని చేసింది ఏమీ లేదు. ప్రతి దానికి ఒక భాష్యం చెప్పడం, ఒక ఉద్దేశం అంటగట్టడం, తప్పు పట్టడం….ఇదే శనివారం జరిగింది. ఈ వారం నామినేషన్లలో ఉన్న వారిలో గణేష్, గీతామాధురి సురక్షితులయ్యారని ప్రకటించారు. అదేవిధంగా బిగ్ బాస్ షను ప్రమోట్ చేస్తూ అమెరికాలో ఎవరో ఒక వీడియో సాంగ్ చేశారంటూ చూపించారు. అదీ బిగ్ బాస్ సృష్టే అని అనుకోడానికి లేదని బిగ్ బాస్ కూడా చెప్పలేరు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*