జగనన్న పాలనలో మహిళలు లక్షాధికారులు : ఎంఎల్ఏ బియ్యపు మధు

శ్రీకాళహస్తి : వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలను లక్షాధికారులను చేస్తున్నారని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మహిళల ఆర్థిక సమస్యలు అన్నీ తీరుతున్నాయని చెప్పారు. వైయస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం నిర్వహించారు.

అనంతరం బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…సి‌ఎం జగనన్న మహిళల సంరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు చెప్పట్టి, అందరికీ ఒక అన్నగా, మీ ఇంటి బిడ్డగా ఆశీస్సులు పొందుతునందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 54 వేల మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు 52 కోట్ల రూపాయలు ఆసరా పథకం కింద బ్యాంకు ఖాతల్లో పడుతుందని చెప్పారు. రాబోయే 3 సంవత్సరాలు ఇదేవిధంగా డబ్బు జమ అవుతుందన్నారు. ఏ బ్యాంకులూ అక్క చెల్లెమ్మల డబ్బులను పాత బాకీలకు జమచేయకూడదని కోరారు.

ప్రతి మహిళను లక్షాధికారిని చేయడానికి జగనన్న అడుగులు వేస్తున్నారని చెప్పారు. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, ‌వై.ఎస్‌.ఆర్ సంపూర్ణ పోషణ, ‌వై.ఎస్‌.ఆర్ చేయూత ఇలా వరుసగా పథకాలు చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారని అన్నారు. అక్టోబర్ 2 వ తేదీన వై.యస్.ఆర్ జగనన్న కాలనీల్లో మహిళల పేరుతో ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తామని ప్రకటించారు. బడికెళ్లే మన బిడ్డల కోసం యునిఫాం‌ దుస్తులు, బ్యాగు, బూట్లు, పుస్తకాలు ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో, డ్వాక్రా రుణాలు మాఫీ అని మీ అందరికీ బాహుబలి సినిమా చూపించారని ఎద్దేవా చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*