జగన్‌తో క్లోజ్‌గా ఉంటారు…అమిత్‌షా వస్తే హడావుడి చేస్తారా… రమణ దీక్షితులూ…ఇప్పుడు అనుభవించండి!

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై వేటు వేయడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన టిటిడిపై, ప్రభుత్వంపైన చేసిన విమర్శలతో పాటు గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితోనూ, ఇప్పుడు జగన్‌తోనూ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షాతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే ఆయన ఉద్వాసనకు కారణంగా కనిపిస్తోంది. విజయవాడలో ఓ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రమణ దీక్షితులుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. ఆ సమావేశంలోనే రమణ దీక్షితులు వ్యవహార శైలి కూడా చర్చకు వచ్చింది. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలలో ఆయనతో ప్రత్యేక యాగం చేయించారు రమణ దీక్షితులు. మొన్న అమిత్‌షా తిరుమలకు వచ్చినపుడు హడావుడి చేశారు. జగన్‌తోనూ సన్నిమితంగా ఉంటారన్న అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చిన సందర్భంలో ఆయన్ను ఆశీర్వదించడానికి రమణ దీక్షితులు రాలేదని అంటున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. అందుకే…ఆలయంలో ఇనుప నిచ్చెన ఏర్పాటుపై ఫిర్యాదు చేయడానికి రమణ దీక్షితులు గతంలో ముఖ్యమంత్రిని కలవడానికి విజయవాడ వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి ఆయన్ను కలవలేదు. దీంతో రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడి వెనక్కి వచ్చారు. అంటే ప్రభుత్వానికి రమణ దీక్షితులుపై మంచి అభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో ఆయన చెన్నైలో తీవ్ర విమర్శలు చేశారు. టిటిడి వ్యవహారాలపై ముఖ్యమంత్రిగానీ, దేవాదాయ శాఖ మంత్రికిగానీ ఫిర్యాదు చేస్తానని ఆయన అనలేదు. నేరుగా ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అంతేకాదు…టిటిడిని రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని, టిటిడి నిధులను తరలిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. దీంతో ప్రభుత్వానికి రమణ దీక్షితులుపై ఉన్న కోపం నషాలానికి ఎక్కింది. ఆయనపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

ప్రభుత్వ ఆదేశాలతో వ్యూహాత్మకంగా టిటిడి అధికారులు వ్యవహరించారు. రమణ దీక్షితులను తొలగించడానికి 65 ఏళ్ల వయో పరిమితి అస్త్రాన్ని బయటకు తీశారు. అదేవిధంగా మిరాశీయేతర అర్చకుల సర్వీసు క్రమబద్దీకరణకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. కొత్తవారిని నియమించాలంటే వయసు మీరిన వారిని రిటైర్‌ చేస్తున్నామని చెప్పారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వం, టిటిడి ప్రణాళిక ప్రకారమే అర్చకులకు 65 ఏళ్ల వయో పరిమితిని తెరపైకి తెచ్చి, రమణ దీక్షితులుపై వేటు వేసింది. వాస్తవంగా ఆయనకు ఇప్పడు 70 ఏళ్లు. 65 ఏళ్ల తరువాత అర్చకులు పని చేయకూడదని అనుకునివుంటే ఐదేళ్ల క్రితమే ఆయన్ను రిటైర్‌ చేసివుండాల్సింది. అప్పడు పట్టించుకోకుండా…ఆయన తీవ్రమైన విమర్శలు చేసినపుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడమే వివాదాస్పదం అవుతోంది. ఈ వ్యవహారంలో డాలర్‌ శేషాద్రి పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

3 Comments

  1. వందల ఏళ్లుగా ఈ నాలుగు కుటుంబాలే స్వామి సేవలో ఉన్నారు. అలాగే, కైంకర్యాలను సజావుగా కొనసాగించడంలో రామానుజులు మొదలుపెట్టిన జీయర్ల మఠం కూడా.. ఈ రెండు వ్యవస్థలపై ఎవ్వడీకీ పెత్తనం లేదు.. ఈ అరాచకానికి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు.

  2. ఈ నాలుగు కుటుంబాకు మాత్రమే స్వామి చెందుతాడా. ఇంతకన్నా స్వార్థం దౌర్భాగ్యం ఇంకొకటుందా. లి

  3. Yes, due to his undue criticism through media on the sacred organisatipn, he is deserved for disciplinary proceedings against him.

Leave a Reply

Your email address will not be published.


*