జగన్ గారూ, మీ జెండాను పసుపు రంగులోకి మార్చుకోండి..!

జగన్ సర్కారుకు అడుగడుగునా ప్రతిపక్షం అడ్డుతగులుతున్న నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఎవరో సెటైరికల్ గా రాసింది సరదాగా ఉంది. మీరూ చదవండి.


రంగుల విషయంలో ఎన్నిసార్లు చెప్పిన మీకు అర్థం కాదా, నాడు నేడులో భాగంగా (పాఠశాలల కోసం) బెంచీలు, ఫ్యాన్ లు చూస్తున్నారని తెలిసింది. వీటిపైన ఎవరైనా కోర్టుకు వెళ్ళే అవకాశం వుంది. కావున క్రింది సలహాలు పాటించాలని మనవి.

1) బెంచ్లు, ఫ్యాన్లు కొన్నాళ్లపాటు వుండాలని గట్టివి కొంటరేమో, అల అయితే ఎక్కువ రేటు పెట్టారని కోర్టుకి వెళ్ళే అవకాశముంది, కావున నాసిరకం కొనమని మనవి.

2) బెంచలకు బ్లూ, గ్రీన్, పింక్ కలర్ సెలెక్ట్ చేస్తారేమో, అవి వైసీపీ, TRS పార్టీలకు చెందినవి, కావున పసుపు రంగు సెలెక్ట్ చేసుకో మనవి, ఈ రంగుకైతే ఎవరూ అడ్డుచెప్పరు. అలాగే ఎప్పుడో భవిష్యత్తులో టీడీపీ అధికారలోకి వస్తే మేమే అన్ని చేశాం అని చెప్పుకోవచ్చు. వాళ్లకు ఆ అవకాశం ఇవ్వమని మనవి.

3) ఫ్యాన్లకు మూడు రెక్కలున్నాయి, వైసీపీ పార్టీ ఫ్యాన్ లకు కూడా మూడు రెక్కలున్నయి, కావున ఒక రెక్క తీసేయమని ప్రార్థన.

4) బోర్డ్ గ్రీన్ కలర్ లో వుంది, అది వైసీపీ కలర్ కావున పసుపు రంగు లోని లేదా కాషాయ రంగులో వుండేలా చూడమని మనవి.

5) వాటర్ ఫిల్టర్ స్టాండ్ బ్లూ కలర్ లో వుంది అది వైసీపీ కలర్ కావున దానిని వీలయితే వాటర్ ట్యాంక్ పసుపు రంగులోకి మార్చ మనవి.

6) చివరిగా ఇవన్నీ కష్టమైతే మీ పార్టీ జెండా కూడా పసుపు రంగులోకి మార్చుకోమని మనవి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*