జగన్ తోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యం : గున్నేరి కిషోర్ రెడ్డి

శ్రీకాళహస్తి : గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందని ఏర్పేడు మండలం వైసీపీ ఇన్చార్జ్ కిషోర్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం ఆముడూరు పంచాయతీలోని గిరిజన కాలనీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కిషోర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా ఇంటి స్థలాలు మంజూరు, హౌసింగ్ కాలనీ ఏర్పాటు, రేషన్ కార్డుల మార్పు, తదితర సమస్యలను పరిష్కరించాలంటూ కిషోర్ రెడ్దిని గిరిజనులు వినతిపత్రం అందించి కోరారు. దీంతో స్పందించిన కిషోర్ రెడ్డి… గిరిజనుల సమస్యలను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, గిరిజనుల అభివృద్ధికి తోడ్పడటం తోపాటు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 30 మంది గిరిజన కుటుంబాల వారికి కొత్త రేషన్ కార్డులు ఇప్పించడంతో పాటు ఇంటి స్థలాలు మంజూరు, నూతన గృహాలు మంజూరు చేసి, గృహాలు కట్టి ఇప్పించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గిరిజన కాలనీలో సిసి రోడ్లు ఏర్పాటు, తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తానని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు ప్రత్యేకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ పథకాలను గిరిజనులంతా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. దీంతో గిరిజనులంతా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి, కిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండలం వైసిపి సీనియర్ నాయకులు, అముడూరు చంద్రశేఖర్, నాయకులు పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*