జగన్ తో ఆవేశంగా మాట్లాడిన రోజా..! నీళ్లు తాగమన్న జగన్..!!

  చిత్తూరు జరిగిన అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో వేదికపైనే నగరి ఎంఎల్ఏ రోజా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడటం చర్చనీ యాంశంగా మారింది. వేదికపై జగన్ పక్కన పెద్దిరెడ్డి కూర్చున్నారు. కొంత దూరంలో రోజా కూర్చున్నారు. పెద్దిరెడ్డి పోడియం వద్దకు వెళ్లి ఉపన్యసించే సమయంలో రోజా వెళ్లి జగన్ పక్క సీట్లో కూర్చున్నారు. ఆమె ఏదో సీరియస్ గా, కాస్త ఆవేశంగా జగన్ తో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఈ తరుణంలో జగన్ టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసును రోజా ముందుకు తోసి, నీళ్లు తాగు అన్నట్లు ఆమెకు సూచించారు. ఆ తరువాత రోజా తలపైన చెయ్యిపెట్టి నెమిరారు. దీంతో రోజా కాస్త తేలికపడినట్లు కనిపించారు.

ఇంతకీ రోజా సిఎంతో ఏమి మాట్లాడి వుంటారనేది మీడియా ప్రతినిధుల్లో చర్చనీయాంశం అయింది. ఇటీవల రోజా తన సొంత నియోజకవర్గంలో ఓ గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలే ఆమెను అడ్డుకున్న ఉదంతం వార్తలకెక్కింది. టిడిపి నుండి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రోజా రోజా ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలు ఆరోపించిన సంగతి తెలిసిందే. రోజాను అడ్డుకున్న వారిపై పోలీసు కేసులు కూడా పెట్టారు.

ఈ వివాదం గురించే రోజా పార్టీ అధినేత జగన్ తో చర్చించి వుంటారని, వివరణ ఇచ్చివుంటారని మీడియా ప్రతినిధులు ఊహిస్తున్నారు. రోజా ఆవేదనను గమనించిన జగన్…. ఆమెను అనునయించారని, టెన్షన్ పడొద్దని చెప్పి వుంటారని వేదికపైన జరిగిన దృశ్యాన్ని చూసినవారు భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*