జగన్ ప్రభుత్వ చర్యలతో చంద్రబాబూ సంతోషించవచ్చు..! ఆ క్రెడిట్ తీసుకోవచ్చు..!!

కరోనా కష్టకాంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో విద్వేష రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, ఆ పార్టీకి అనుకూంగా ఉన్న మీడియా ప్రభుత్వంపైన దుమ్ముత్తిపోస్తూనే ఉన్నాయి. అసంబద్ధమైన విమర్శలు, ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

ఇటువంటి వాటికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మీడియా ముందుకు వచ్చి సమాధానాలు ఇవ్వడం లేదుగానీ….చేతలతో మాత్రం మారు మాట్లాడలేని జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

కరోనా పరీక్షలు ఎక్కువగా జరగడం లేదని చంద్రబాబు నాయుడు పదేపదే విమర్శలు చేస్తూ వచ్చారు. వాస్తవంగా మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ సగటుకు మించి పరీక్షలు జరుగుతున్నాయి. మొదట్లో కిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల పరీక్షలు వందల్లో మాత్రమే జరిగాయి. కిట్లు సమకూర్చుకుని రోజురోజుకూ పరీక్షల సంఖ్య పెంచుతూవెళుతోంది ప్రభుత్వం. ఈ పరిస్థితి దేశ వ్యాపితంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది.

అయినా ఇవేవీ పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పరీక్షలు జరగడం లేదనే విధంగా ప్రతిపక్షం ప్రచారం చేసింది. చంద్రబాబు తాను నివాసం ఉంటున్న తెంగాణలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తక్కువ పరీక్షలు జరుగుతున్నా నోరు విప్పలేదు. జాతీయ స్థాయిలో పరీక్షల గురించి కేంద్రాన్ని మాటమాత్రంగానైనా ప్రశ్నించలేదు. ఏపి విషయంలో మాత్రం పనిగట్టుకుని విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలో….ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా పరీక్ష సంఖ్యను బాగా పెంచింది. ల్యాబ్‌ల సంఖ్యను పెంచింది. కిట్లను సమకూర్చుకుంది. దీంతో ఒకేరోజు ఆరేడు వేల నమూనాలను పరీక్షించే అవకాశం ఏర్పడిరది. ఇప్పటిదాకా ఏపిలో 61,266 పరీక్షలు జరిగాయి. అదే పక్కనున్న తెలంగాణలో పరీక్షల సంఖ్య 18,514 మాత్రమే. ఏపిలో ప్రతి పది లక్షల మందికి 1,147 పరీక్షలు జరగుతుంటే… తెలంగాణలో 462గా ఉంది. (25.04.2020 నాటికి). ఇదే రీతిగా పరీక్షలు నిర్వహిస్తే…. సగటులోనే కాదు మొత్తం పరీక్షల్లోనూ ఏపి నెంబర్‌ వన్‌ స్థానానికి వెళ్లే అవకాశాలున్నాయి.

సాధ్యామైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాని కోరడంలో తప్పులేదు. అయితే…ఏపిలో మాత్రమే తక్కువగా పరీక్షలు చేస్తున్నారని ప్రచారం చేయడమే అభ్యంతరకరం. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తున్నంతగా టిడిపి ఫోజు పెట్టింది. చంద్రబాబు హడావుడి చేశారు. అటువంటి తెలంగాణ వ్యవహారాపైన బాబు మాట్లాడరు. జగన్‌ ప్రభుత్వం మీద మాత్రం కత్తెత్తుకుని తిరుగుతారు. దీన్నిబట్టి…ప్రజా ప్రయోజనం కంటే జగన్‌ను టార్గెట్‌ చేయడమే చంద్రబాబు లక్ష్యమన్న భావన సర్వత్రా కలుగుతోంది.

పరీక్షల సంఖ్య తక్కువన్నారు, ల్యాబ్ లు లేవన్నారు, కిట్లు కొనుగోలు చేస్తే అక్రమాలు జరిగాయన్నారు, ఆ తరువాత అవి సరిగా పని చేయడం లేదని విమర్శించారు, ఇప్పుడు జగన్‌ వీధుల్లోకి రావడం లేదని ఆరోపిస్తున్నారు….అంటే ఎప్పుడే ఏదో ఒక నెపంతో ప్రభుత్వాన్ని విమర్శించానే లక్ష్యం తప్ప….విమర్శల్లో నిజాయితీ కనిపించడం లేదు.

చంద్రబాబు చేస్తున్న విమర్శలకు జగన్‌ మాటతో కాకుండా చేతతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు తిరిగి మాట్లాడలేని పరిస్థితి కల్పిస్తున్నారు.  తాను కోరినట్లు కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగినందుకు చంద్రబాబు కూడా సంతోషించవచ్చు.‌ ఈ క్రెడిట్ అంతా తనదే అనికూడా బాబు చెప్పుకోవచ్చు. కాదనేవాళ్లు ఎవరుంటారూ..!

ఎప్పుడూ విమర్శలే కాదు…ఒక్కోసారి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను అభినందించాలి. కరోనా టెస్టుల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి వెళ్లినపుడు ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చు. అలాంటిదేమీ లేకుండా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటే…..జనం మెచ్చరు. మొత్తంమ్మీద కరోనా పరీక్షల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి అభినందనలు. కరోనా కట్టడి విషయంలో జగన్‌ ప్రభుత్వం మరింత పకడ్బందీగా పనిచేసి ప్రజల ప్రశంసలు అందుకోవాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*