జనవరి ఫస్ట్‌కు ఏర్పాట్లు వొద్దంట…గత ఏడాది వివాదాస్పదమైనా మళ్లీ ఆవే ఆదేశాలు..!

జనవరి 1న ఆలయాల్లో న్యూ ఇయర్‌ వేడుకలు జరపవొద్దంటూ గత ఏడాది హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఇచ్చిన సర్క్యులర్‌ తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అటువంటి సర్క్యులరే రావడంతో…న్యూ ఇయర్‌కి ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ చేయడం లేదని పలు ఆలయాలు ప్రకటించాయి.

ఏ విషయంలోనైనా ఆలయాలను ఆదేశించే అధికారం ఆ ట్రస్టుకు లేదు. టిటిడి వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఆదేశించే అధికారం అసలు లేదు. అయినా  అధికారులు…ట్రస్టు సర్క్యులర్‌కు చిత్తం అంటూ తలూపి,

ఆలయాల్లోనే నూతన సంవత్సర వేడుకలు ఆపేశారు.

ఆ ట్రస్టు ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉందా?

ఏ ఆలయానికైనా ఆదేశాలు ఇచ్చే అధికారం హెచ్‌డిపిటికి లేదు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగానీ, కమిషనర్‌గానీ ఆదేశాలు ఇవ్వడానికి అవకాశాలున్నాయి. అయితే…ట్రస్టు ఇచ్చిన సర్క్యులర్‌నే చూపుతూ….న్యూ ఇయర్‌కి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని శ్రీకాళహస్తి వంటి దేవాలయాలు ప్రకటించాయి. అయినా…ఆ ట్రస్టు పని ఇది కాదు. హిందూ ధర్మాన్ని ప్రచారాన్ని చేయడం కోసం ఏమి చేయా

లో ట్రస్టు ఆలోచించాలి. అంతేగానీ…శతాబ్దాలుగా, దశాబ్దాలుగా వస్తున్న…ఓ సంప్రదాయాన్ని అడ్డుకోవడం వల్ల హిందూ ధర్మానికి ఒరిగేది ఏమీ ఉండదు.

జనవరి1కి, ఉగాదికి పోటీ ఎందుకు?

హెచ్‌డిపిటి విడుదల చేసిన సర్క్యులర్‌లో…ఉగాదిని నూతన సంవత్సరాదిగా పాటించాలని పేర్కొన్నారు. జనవరి ఫస్ట్‌ను నూతన సంవత్సరంలో తొలి రోజుగా గుర్తించడమంటే పాశ్చాత్య సంస్కృతిని పాటించినట్లు చెప్పారు. అయినా…జనవరి 1కి, ఉగాదికి పోటీ పెట్టాల్సిన అవసరం ఏముంది. దేని ప్రాధాన్యత దానిదే. జనవరి, ఫిబ్రవరి…ని ఇదేదో అంగ్ల క్యాలెండర్‌గా చెబుతున్నప్పటికీ….ప్రపంచం మొత్తానికి ఒక క్యాలెండర్‌ వ్యవస్థ ఉండాలన్న ఉద్ధేశంతో అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే. అంతే తప్ప ఇది ఒక భాషకో, ఒక దేశానికో చెందిన క్యాలెండర్‌ కాదు. సమయాన్ని ఏ విధంగానైతే నిర్ధారించుకున్నామో…తేదీలనూ ఆదే విధంగా నిర్ణయించుకున్నారు. అంతే…తప్ప ఇందులో మతాలు, భాషలు, దేశాలకు సంబంధించిన ప్రమేయం ఏమీలేదు. ఒకప్పుడు క్రీస్తుకు పూర్వం ( కీ.పూ. – బిఫోర్‌ క్రీస్తు – బి.సి) అని, క్రీస్తు శకం (కీ.శ.-ఆఫ్ట్‌టర్‌ డెత్‌ – ఏడి) అని వాడేవారు. ఇప్పుడు అలా వాడటం లేదు. వాటి పేర్లు మార్చేశారు. ఎందుకంటే ప్రపంచంలో క్రీస్తును అంగీకరించని దేశాలూ ఉన్నాయి. అందుకే…అందరికీ ఆమోద యోగ్యంలా ఉండేందుకు….క్రీస్తు శకం బదులు కామన్‌ ఎరా (సి.ఇ), క్రీస్తు పూర్వానికి బదులు బిఫోర్‌ కామన్‌ ఎరా (బిసిఈ) వాడుతున్నారు. అలాంటప్పుడు మత సంబంధ అంశాలూ అందులో లేనట్లే లెక్క. కానీ…జనవరి, ఫిబ్రవరి…అనేది అదేదో ఒక మతానికి సంబంధించిన క్యాలెండర్‌ అన్నట్లు ప్రచారం చేస్తూ దాన్ని పాటించాల్సిన అవసరం లేదన్న వాదన తెస్తున్నారు. అయినా…భారతీయుల పండుగలు వంటివి ఆయా భాషలు, స్థానిక క్యాలెండర్ల ప్రకారమే జరుగుతున్నాయి. కొన్ని పండుగల్లో తమిళనాడుకు, మనకు మధ్యే చాలా తేడాలున్నాయి. అయినా…ఎవరి నెలలు ప్రకారం వారు పండుగలు చేసుకుంటున్నారు. పండుగలు, సంప్రదాయాలకూ….జీవన గమనం కోసం వాడే క్యాలెండర్‌కు మధ్య పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే…ఉగాది పండుగను ఆమెరికాలో ఉన్నవారైనా మన తెలుగు క్యాలెండర్‌ సూచించిన రోజునే చేసుకుంటారు. అలాంటి వాటికి ఇంకో క్యాలెండర్‌ కూడా లేదు.

క్యాలెండర్లు, డైరీల్లో ఏ తేదీలు ముద్రిస్తారు?

టిటిడి సహా ప్రతిఏటా ప్రముఖ ఆలయాలన్నీ దేవుని చిత్రాలో క్యాలెండర్లు, డైరీలు ముద్రిస్తున్నాయి. ఇవి లక్షల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఆ క్యాలెండర్లపై ఆంగ్ల సంవత్సర తేదీలనే ముద్రిస్తున్నారు. ఇలా చేయడం హిందూ సంప్రదాయాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందా? తెలుగు నెలలో, తమిళ నెలలో ముద్రిస్తే…ఆ క్యాలెండర్లు, డైరీలు అమ్ముడవుతాయా? పక్క రాష్ట్రం వారికి మన తెలుగు క్యాలెండర్‌ ప్రకారం తేదీలు వేసి పంపితే….వారికి అర్థమవుతుందా? తమిళనాడు క్యాలెండర్‌ ప్రకారం వాళ్ల మనకు లేఖ రాస్తే మనకు అర్థమవుతుందా? అయినా మన పండగలు వంటి వాటిని పాటించడానికి పంచాంగం ఎటూవుండనే ఉంది. అలాంటప్పుడు జనవరి, ఫిబ్రవరిని…వివాదం చేయాల్సిన అవసరం ఏముందన్నది సామాజిక మాధ్యమాల ప్రశ్న.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*