జరగబోయేది చంద్రబాబుకు అర్థమైపోయిందా…!

Nara Chandrababu Naidu

ఈనెల 17వ తేదీ నుంచి ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాపితంగా సభలు నిర్వహించాని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ సభ ద్వారా మూడు రాజధానులు, పింఛన్లు, రేషన్ కార్డులు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతామని చెబుతున్నారు. ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతి కేంద్రంగా దాదాపు 60 రోజుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయాన్ని బట్టి చూస్తే….నిరంతరాయంగా ప్రజల్లో ఉండేందుకు టిడిపి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అనిపిస్తుంది.

సాధారణంగా ఎన్నికకు ఏడాది ముందు ఈ విధంగా నిరంతరాయంగా జనంలో ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకుంటారు. అయితే రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా నాలుగు ఏళ్లకుపైగా సమయం ఉంది. అయినా ఏడాదిలో ఎన్నికలొస్తాయన్నంత ఆతృతగా చంద్రబాబు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇదమనతా ఎన్నికల కోసమే చేస్తున్నారా లేక మరేదైనా కారణాలున్నాయా..?

ఎన్నికలకంటే… సమీప భవిష్యత్తులో ఎదురుకానున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు నాయుడు తన వ్యూహాలకు పదును పెట్టారని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన సిఎంగా ఉన్న సమయంలో వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాసులు ఇంట్లో ఐదు రోజుల పాటు ఐటి అధికారులు తనిఖీలు నిర్వహించడం తెలిసిందే. ఈ తనిఖీల్లో, బాబు అక్రమాలకు సంబంధించి కీలక ఆధారాలు దొరికాయని చెబుతున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఏపి నుంచే కాంగ్రెస్ పార్టీకి అవసరమైన నిధులు వెళ్లాయన్న ప్రచారమూ సాగుతోంది.

అదేవిధంగా అమరావతిలో ఇన్ సేడర్ ట్రేడింగు జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. వేల కోట్ల మలువైన భూములను టిిిడిపి నేతలు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. దీనిపైన సిఐడి, ఈడి విచారణ జరుపుతున్నాయి. ఇవన్నీ నిజమైతే…. బాబు మెడచుట్టూ బమైన ఉరి బిగిసినట్లే అవుతుంది. కేసు నమోదై చంద్రబాబు జైలుకు వెళ్లే పరిస్థితి దాపురించవచ్చు.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఇప్పటి నుంచే జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఇదే వ్యూహం అనుసరించారు. తనకు ఏదైనా జరిగితే మీరంతా నా చుట్టూ ఉండాలి అంటూ టిడిపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తనను అరెస్టు చేయవచ్చన్న భయాందోళనను ఆయన బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వచ్చారు. ఆయన చెప్పినట్లు జరగలేదుగానీ….పార్టీ శ్రేణును అప్రమత్తంగా ఉంచడానికి అది ఉపయోగపడింది.

ఒకవేళ కేసు నమోదై, బాబు అరెస్టు అయితే…. అప్పటికప్పుడు ప్రజా ఉద్యమం ఉప్పొంగకపోవచ్చు. అందుకే ఇప్పటి నుంచి తమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాడుతుంటే తనపై కేసు పెట్టారని ప్రచారం చేసుకోవడం కోసం, తద్వారా సానుభూతి సంపాదించడం కోసం…. నిరంతరాయంగా ఉద్యమాలను నడిపిస్తున్నారని పరిశీకులు చెబుతున్నారు. రాజధాని అమరావతి ఉద్యమం కూడా ఇందులో భాగమే అని అంటున్నారు. ప్రభుత్వం రాజధాని రైతు సమస్యకు పరిష్కారం చూపెట్టినా…..ఉద్యమాన్ని కొనసాగించడంలోని ఆంతర్యం ఇదేనని అంటున్నారు. ఈ వ్యూహం బాబును ఎంత వరకు రక్షిస్తుందో చూద్దాం…!

  • ఆదిమూం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*