జర్నలిస్టు సాయి టార్గెట్‌గా సోషల్‌ మీడియా ట్రోలింగ్‌..! ఇంతకీ సాయి చేసిన తప్పేమిటి..!!

జెనిమి న్యూస్‌తో పాటు వివిధ మీడియా సంస్థల్లో పని చేసి, జర్నలిస్టు సాయి పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి, ప్రస్తుతం  న్యూస్ 9 ఛానల్‌లో పని చేస్తున్న సాయిని ల‌క్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. ప్రత్యేకించి డాక్టర్లుగా ఉన్నవారు సాయిపైన విరుచుకుపడుతున్నారు. ఎప్పుడూ ట్రోలింగ్‌ వంటి వాటికి దూరంగా ఉండే వైద్యు కూడా ఎందుకు అంతగా సాయిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఇంతకీ ఏం జరిగింది?

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే సుధాకర్‌ అనే వైద్యుని (అనస్థీషియన్‌) ఉదంతం చాలామందికి తెలిసేవుంటుంది. ఎన్‌ 95 మాస్కు ఇవ్వడం లేదని, పిపిఇలు అందుబాటులో లేవని మీడియా ముందు ఆవేశంగా మాట్లాడారు. ఈ వీడియాలో తెంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రును వాడు అనే ఏకవచనంతోనూ సంబోధించారు. ఈ వీడియో ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో ప్రసారమయింది. సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత వైద్యునిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది.

డాక్టర్‌ సుధాకర్‌ చేసింది సరైనదా కాదా అనే సంగతి తరువాత చర్చిద్దాం. ముందుగా జర్నలిస్టు సాయి విషయానికొస్తే…. నర్సీపట్నంలో జరిగిన డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంపై సాయి తన ఛానల్‌లో డిబేట్‌ పెట్టారు. ఈ సందర్భంగా వివాదానికి కేంద్రంగా ఉన్న డాక్టర్‌ సుధాకర్‌నే నేరుగా ఫోన్‌లైన్‌లోకి తీసుకున్నారు. ఈ డిబేట్‌లో సాయి కొన్ని ప్రశ్నను ఆయనకు సంధించారు. నర్సీపట్నం ఆస్పత్రి కోవిడ్‌ ఆస్పత్రి కాదుకదా…అయినా మీరు అనస్థీషియన్‌ కదా…మీకు ఎన్‌ 95 మాస్కు ఎందుకు….మాకు రాజకీయం చేస్తున్నారు…ఇలా ప్రశ్న వర్షం కురిపించారు. ఈ క్రమంలో అనస్థీషియన్‌ అంటే చుకన భావన కలిగేలా సాయి ఒకటి రెండు మాటు అనేశారు. (ఈ చర్చలో ఆ డాక్టర్‌ కూడా సహనం కోల్పోయి….‘యేయ్‌’ అంటూ సాయి పట్ల అమర్యాదగా మాట్లాడారు.)

అనస్థీషియన్లను ఉద్దేశించి తెలిసో తెలియకో సాయి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అనస్థీషియన్లే కాకుండా వైద్యుంతా స్పందిస్తున్నారు. విరంచి అనే పేరుతో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యు సుదీర్ఘమైన వ్యాసమే ఫేస్‌బుక్‌లో రాశారు. వైద్య రంగంలో, ప్రత్యేకించి సర్జరీు చేసేటప్పుడు, వెంటిలేటర్లు అమర్చేటప్పుడు అనస్థీషియన్ల ప్రాముఖ్యత ఎంతగా ఉంటుందో వివరించారు. సాయి చేసిన వ్యాఖ్యపై నొచ్చుకుంటూనే ఆయన ఈ వ్యాసం రాశారు.

ఈ వ్యాసంతో చర్చ మరింత తీవ్రమయింది. ట్రాలింగ్‌ రూపంలోకి మారింది. జర్నటిస్టు సాయికి వైద్యం గురించి కనీస పరిజ్ఞానం లేదని ఒకరు, అనస్థీషియా లేకుండా సర్జరీ చేయించుకుంటావా అని ఒకరు….ఇలా రకరకాుగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఏ రాజకీయాతో సంబంధం లేని వారు కూడా, వృత్తిపరంగా నొచ్చుకుని సాయిపై కామెంట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. రాజకీయాపై కామెంట్లు వేరు. వృత్తి నిపుణుల‌పై కామెంట్లు వేరు. రాజకీయా నాయకుపై ఒకమాట ఇటూ ఇటూ అయినా ఏమీ కాదు. సున్నితమైన అంశాపై వ్యాఖ్యానించేటప్పుడు సంయమనం తప్పనిసరి అని సాయి ఉదంతం చెబుతోంది. దీనిపై జర్నలిస్టు ఎలా స్పందింరనేది చూడాలి.

ఇక డాక్టర్‌ సుధాకర్‌ విషయానికొస్తే….ఎంతమంది వైద్యు ఆయన్ను వెనకేసుకుని రావచ్చుగాక…ఆయన ప్రవర్తించిన తీరు ఏమాత్రం బాగోలేదు. మాస్కుల‌ కొరత ఉండొచ్చు. పిపిఇలు లేకపోవచ్చు. సమస్యను ఉన్నతాధికారు దృష్టికి తీసుకెళ్లడంలో తప్పులేదు. అవసరమైతే మీడియా దృష్టికీ తీసుకురావచ్చు. అయితే…ఈ సందర్భంలో సంయమనం కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం, ముఖ్యమంత్రునూ దూషించడం ఆయన చేసిన పెద్ద తప్పు. ఆయనకు అక్కడి టిడిపి నేతల‌తో అన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ నాయకుల‌ ప్రోద్బంతోనే అలా మాట్లాడారని, నర్సీపట్నం ఆస్పత్రి కోవిడ్‌ ఆస్పత్రి కాకున్నా పరిమితి సంఖ్యలో మాస్కులు, పిపిఇలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయినా…మాస్కులు, పిపిఇ కొరత దేశమంతా ఉంది. వాటిని సమకూర్చడానికి ప్రయత్నాు జరుగుతున్నాయి.

ఇవన్నీ తెలిసి కూడా డాక్టర్‌ సుధాకర్‌ అలా ప్రవర్తించడం వెనుక…ప్రభుత్వం చెబుతున్నట్లు రాజకీయ ప్రేరణ ఉన్నట్లు భావించాల్సిన పరిస్థితి. ఇక జర్నలిస్టు సాయితో డిబేట్‌ సమయంలోనూ…. సంయమనం కోల్పోయి మాట తూలి సాయిని దూషించారు. అనస్థీషియన్‌కు పెద్దగా పనేముంటుందని సాయి ఒక మాట అనివుం డొచ్చుగానీ… సుధాకర్‌ దూషించినా సముదాయించుకునే మాట్లాడారు. ఈ వాస్తవాన్ని కూడా సాయిపై ట్రోలింగ్‌ చేస్తున్న వైద్యు గుర్తించాల్సిన అవసరం ఉంది.

1 Comment

  1. ఈ సాయి ఓవర్ యాక్షన్ మానుకోవాలి

Leave a Reply to తిరుమల్ ప్రసాద్ పాటిల్ Cancel reply

Your email address will not be published.


*