జస్టిస్ ఈశ్వరయ్య మీద కుట్రలు..! చంద్రబాబు మరో తప్పిదం..!!

హైకోర్టు మాజీ న్యాయమూర్తి, అఖిల భారత బిసి ఫెడరేషన్ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్య నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మీద పచ్చపార్టీ పెద్ద కుట్రకు తెరలేపింది. ఎనిమిదేళ్లుగా సస్పెన్షన్ లో ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణను పావుగా వాడుకుని ఈశ్వరయ్యను ఇబ్బంది పెట్టడానికి కుతంత్రం చేస్తోంది. అంతిమంగా ఇది తమ పార్టీకే నష్టమనే విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.

హైకోర్టు ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈశ్వరయ్య కుట్రలు చేస్తున్నారంటూ‌ టిడిపి అనుకూల టివి ఛానల్ ఓ ఆడియోను ప్రసారం చేస్తోంది. అది రామకృష్ణ, ఈశ్వరయ్య మాట్లాడుకున్న ఫోన్ కాల్ రికార్డు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈశ్వరయ్యపైన ఎవేవో అభాండాలు వేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే…

ఎనిమిదేళ్లుగా సస్పెన్షన్ లో ఉన్న తనకు‌ సహాయం చేయమని‌ అడిగేందుకు రామకృష్ణ…జస్టిస్ ఈశ్వరయ్యకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య… న్యాయ వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడారు. తప్పక సాయం చేస్తానని రామకృష్ణకు ఈశ్వరయ్య హామీ ఇచ్చారు. అయితే…ఈ కాల్ ని రికార్డు చేసి, ఈశ్వరయ్యకు వ్యతిరేకంగా రామకృష్ణ తెలుగుదేశం అనుకూల ఛానల్ కు ఇచ్చారు.

ఇది కుట్రతో చేసిన కాల్ అని తెలియక‌ ఈశ్వరయ్య మనసు విప్పి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హయాంలో, జడ్జిల ఎంపిక విషయంలో ఎస్.సి., ఎస్.టి., బి.సి.లకు వ్యతిరేకంగా ఎలా వ్యవహరించారో రామకృష్ణకు వివరించారు. అస్తవంగా ఎన్నికల సమయంలోనూ ఈశ్వరయ్య ఇదే అంశంపై‌ అనేక పర్యాయాలు మాట్లాడారు. ఎస్.సి.లు, బి.సి.లు న్యాయమూర్తులుగా పనికిరారని చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలనూ బయటపెట్టారు. ఇవే అంశాలను ఈశ్వరయ్య ఇప్పుడూ మాట్లాడారు. ప్రైవేటు సంభాషణల్లో దొర్లిన ఒకటి‌ రెండు మాటలను పట్టుకుని హైకోర్టుకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ ఆ మీడియా హోరెత్తిస్తోంది.

రామకృష్ణతో ఫోన్ చేయించి, చాలా విషయాలను‌‌ ఆయనతో గుచ్చిగుచ్చి మాట్లాడించి, విషయాలు రాబట్టుకుని,‌ ఆయనపైన కుట్ర చేసిందికాక, ఆయనే హైకోర్టుపై కుట్ర చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. ఇటువంటి ఆరోపణలతోనే ఇప్పటికే హైకోర్టులో ఓ కేసు ఉండగా, అందులో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ రామకృష్ణ…తాను రికార్డు చేసిన ఆడియోను‌ హైకోర్టు ముందు ఉంచారు.

ఇతంతా చూస్తుంటే…జస్టిస్ ఈశ్వరయ్య మీద పెద్ద కుట్రకే ప్లాన్ చేశారని అర్థమవుతుంది. దీని వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందన్నది బహిరంగ రహస్యం. ఈశ్వరయ్య మీద అంత కోపం‌ ఎందుకంటే…బిసిల అండతో అధికారం దక్కించుకున్న చంద్రబాబు… అదే బిసిలకు ఎంద ద్రోహం చేస్తున్నారో…గత ఎన్నికల్లో ఈశ్వరయ్య ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. చంద్రబాబును నగ్నంగా నిలబెట్టేశారు. టిడిపి ఓటమికి ఇదీ ఒక కారణం. దీంతో చంద్రబాబుకు ఆయనపైన చెప్పలేనంత కోపం ఉంది.

ఇక‌ తాజాగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర హైకోర్టులో కరోనా వ్యాప్తి, హైకోర్టు ఇన్ ఛార్జి రిజిష్టార్ పని చేసిన రాజశేఖర్ గుండెపోటుతో మరణించడం… ఈ అంశాలపైన స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. అఖిల భారత బిసి ఫెడరేషన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. ఇవి కూడా హైకోర్టు ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈశ్వరయ్య చేసిన కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది.

బిసిలను టిడిపికి దూరం చేసినందుకు కక్ష తీర్చుకోవడం, అదేవిధంగా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడం…ఈ రెండు లక్ష్యాలను పెట్టుకుని ఈశ్వరయ్యను తెలుగుదేశం టార్గెట్ చేసిందని పరిశీలకులు చెబుతున్నారు.

ఇక్కడ చంద్రబాబు మరిచిపోయిన విషయం ఏమంటే…ఈశ్వరయ్య బిసిల కోసం అంకితభావంతో పనిచేస్తున్న వ్యక్తి. ఆమేరకు ఆయనకు దేశవ్యాపితంగా గుర్తింపు ఉంది. తెలుగుదేశంలోని బిసిలతోనూ ఆయనకు మంచి‌ సంబంధా లున్నాయి. ఇప్పుడు చేసిన కుట్రల వల్ల…ఆయనకు పెద్ద నష్టం లేదుగానీ…చంద్రబాబు నాయుడు గౌరవం, ఆదరణ బిసీల్లో మరింత దిగజారి పోతుందనడంలో సందేహం లేదు. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*