జూనియర్ ఎన్.టి.ఆర్. కంటతడి..!

అరవింద సమేత…సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో జూనియర్ ఎన్.టి.ఆర్., అతని సోదరుడు కళ్యాణ్ రామ్ కంటతడి పెట్టారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన తమ తండ్రి హరికృష్ణ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని ఇద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జూనియర్‌ ఉబికివస్తున్న కన్నీళ్లను, కట్టలు తెంచుకుంటున్న దుఃఖాన్ని అతికష్టం మీద ఆపుకున్నారు.

హరికృష్ణ మరణించిన ఐదో రోజే జూనియర్ ఈ సినిమా షూటింగ్ కు హాజరవడాన్ని గుర్తుచేసిన కళ్యాణ్ రామ్…నిర్మాతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదని తమ తండ్రి ఎప్పుడూ చెప్పేవారని, అందుకే అంత దుఃఖంలోనూ జూనియర్ షూటింగ్ లో పాల్గొన్నారని చెప్పారు. ఈ సభలో హరికృష్ణ కు నివాళులర్పించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*