టిక్‌టాక్‌ పిచ్చోళ్లపై కేసులు…ఏడేళ్ల శిక్ష తప్పదా..!

వినోదం కోసం రూపొందించిన సోషల్‌ మీడియా యాప్‌లకు బానిసలైపోతున్నారు కొందరు యువత. ప్రధానంగా టిక్‌టాక్‌ వీడియోల మోజులో ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చూశాం. అలాంటి పిచ్చోళ్లు ఇప్పుడు….టిక్‌టాక్‌ వీడియో కోసం క్రూరమైన చర్యకు పాల్పడి….పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు. అసలు విషయంలోకి వెళితే…

గుజరాత్‌కు చెందిన నలుగురు యువకులు టిక్‌టాక్‌ వీడియో కోసం కొండచిలువ పామును సజీవంగా దహనం చేశారు. తాము చేసిన ఘనకార్యాన్ని వీడియోగా చిత్రీకరించి టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో అటవీ అధికారుల దాకా చేరింది. వన్యప్రాణులను చంపడం నేరం. వీడియోలో ఆధారంగా నలుగురు యువకులను గుర్తించి కేసులు పెట్టారు.

కొండచిలువను చంపి వీడియో తీసిన యువకుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కోర్టులో నేరం రుజువైతే… ఈ యువకులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల దాకా జైలుశిక్ష పడొచ్చు. అదేవిధంగా రూ.25,000 దాకా అపరాధమూ చెల్లించాల్సిరావచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*