టిటిడిది అజ్ఞానం, అహంకారం… రమణ దీక్షితులు మండిపాటు

తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు మీడియాకు, తెలియజేసినందుకు టిటిడి అధికారులు తనపై కచ్చి సాధింపు చర్యలకు పూనుకున్నారని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెప్పారు. టీటీడీ లో పనిచేస్తున్న 65 ఏళ్లు నిండిన అర్చకులను రిటైర్మెంట్ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. తనను టిటిడి నుంచి తొలగించాలన్న కుట్రలో భాగంగానే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అర్చకులను రిటైర్మెంట్ పేరుతో తొలగించే అధికారం టిటిడికి లేదని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మిరాశి అర్చకులు తమ ఒంట్లో శక్తి ఉన్నంత కాలం పూజాది కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వివరించారు. 1996లో మిరాశి వ్యవస్థ రద్దు అయినప్పటికీ అర్చకత్వం చేసే హక్కు మాత్రం రద్దు కాలేదని చెప్పారు . సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆలయానికి వచ్చే ఆదాయంలో భాగం అడగకూడదు గానీ, శ్రీవారికి కైంకర్యాలు చేయడానికి మాత్రం వంశపారపర్యంగా తమకు అధికారం ఉందన్నారు. అర్చకులను రిటైర్డ్ చేస్తూ టిటిడి తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తానని చెప్పారు. టీటీడీ తనకు నోటీసు ఇచ్చిన తర్వాత మరిన్ని వివరాలు చెబుతానని రమణదీక్షితులు పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*