టిటిడిని దెబ్బ‌తీయ‌డానికే ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వ్యాఖ్య‌లు!

జనసేన అధినేత పవన్‌ పవన్‌ కల్యాణ్‌పై వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్‌ అభిమానులు రగిలిపోతున్నారు. జగన్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. పవన్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తప్పా ఒప్పా అనేది పక్కనపెడితే….వ్యూహాత్మకంగానే జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాలి. పవన్‌ను బలోపేతం చేయడం ద్వారా టిడిపిని బలహీనపరచడం జగన్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పవన్‌ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న సమయంలోనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి పట్టువుంది. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లను టిడిపి దక్కించకుంది. జనసేనకూ ఈ రెండు జిల్లాల్లోనే బలంవుంది. పవన్‌ బలం తోడవడం వల్లే గత ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు వచ్చాయన్నది సుస్పష్టం. గోదావరి జిల్లాల్లో తెలుగుదేశానికి గతంలో వచ్చిన సీట్లు పూర్తిగా పడిపోవాలంటే…. పవన్‌ బలపడాలి. పవన్‌ అభిమానులు, సామాజికతరగతికి చెందిన వాళ్లు ఇప్పటికీ ఎవరైనా తెలుగుదేశంతో ఉంటే అందరూ ఏకమై పవన్‌ వైపు కదలాలి. ఈ విధంగా గత ఎన్నికల్లో టిడిపికి వచ్చిన ఓట్లు సగం అటు, సగం ఇటు చీలిపోవాలి. అది వైసిపికి లాభిస్తుంది. వైసిపి ఓట్లు వైసిపికి ఓటూ ఉంటాయి….ఇదీ జగన్‌ ఆలోచన. అందుకే పవన్‌కు, ఆయన అభిమానులకు చురక పుట్టేలా జగన్‌ వ్యాఖ్యలు చేశారని విశ్లేషిస్తున్న వారు ఉన్నారు.

‘పవన్‌ ఎంత బలపడినా వైసిపికి నష్టం లేదు. ఆయన ఓట్లన్నీ గత ఎన్నికల్లో టిడిపికి పడ్డాయి. ఇప్పుడు సొంతంగా పోటీ చేస్తే ఆయన ఓట్లు ఆయనకు పడుతాయి. మాకు ఏమాత్రం నష్టం లేదు.’ అని మొదటి నుంచి జగన్‌ చెబుతూవస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే పవన్‌తో పొత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. కొందరు అటువంటి సూచన చేసినా మారుమాట లేకుండా తిరస్కరిస్తున్నారు. పవన్‌తో పొత్తు ఉండబోదని వైసిపి శ్రేణులకు తన వ్యాఖ్యల ద్వారా మరోసారి జగన్‌ తేల్చిచెప్పినట్లు అయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*