టిటిడిపై పిటీషన్ సిద్ధం చేస్తున్న సుబ్రమణ్య స్వామి

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు టిటిడిపై చేసిన విమర్శల నేపథ్యంలో న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయడానికి బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సిద్ధమయ్యారు. ఈ పిటిషన్ ను తన సహచరులతో కలిసి సిద్ధం చేస్తున్నట్టు ఓ ఫోటోను సుబ్రమణ్యస్వామి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల రిటైర్మెంట్, ఆభరణాల భద్రత, పురాతన కట్టడాల తొలగింపు తదితర అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు గతంలోనే సుబ్రహ్మణ్యస్వామి వెల్లడించిన విషయం తెలిసిందే. కోర్టుకు వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో పిటీషన్ తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు సుబ్రహ్మణ్యస్వామి. తన న్యాయబృందం సభ్యులైన మోహన్ దాస్, టి ఆర్ రమేష్, ఆర్ రవి తో కలిసి పిటీషన్ తయారుచేస్తున్నట్లు ఆయనే ట్విట్టర్లో శనివారం వెల్లడించారు.

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న రమణదీక్షితులు ను ఆకస్మికంగా పదవినుంచి తొలగించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగడం లేదని, ఆలయంలోని వంటశాలను గుప్తనిధుల కోసం తవ్వారని, స్వామివారి ఆభరణాలు మాయం అవుతున్నాయని తదితర తీవ్ర ఆరోపణలను ఆయన చేశారు. ఈ అంశంపై రమణదీక్షితులు న్యాయపోరాటం చేస్తానని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన సుబ్రమణ్యస్వామిని కలిశారు.

సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో ఏమి వాదించే పోతారం ఏది ఆసక్తికరంగా మారింది. టిటిడిలో జరుగుతున్న వ్యవహారాలపై సి.బి.ఐ విచారణ జరిపించాలని రమణదీక్షితులు డిమాండ్ చేస్తున్నారు. సుబ్రమణ్యస్వామి కూడా ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి విచారణకు అభ్యర్ధించే అవకాశాలున్నాయి.

1 Comment

  1. చంద్రబాబు పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి..

Leave a Reply

Your email address will not be published.


*